Wednesday, 28 March 2018

463. Sarva Chithambu Nidenayya

సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును 
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్ధించుచుంటి నీ సన్నిధి
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా  
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా 
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా 
ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా   

462. Samarpana Cheyumu Prabhuvunaku

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును 
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా     
ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెను
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      
నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవా
నీవిచ్చెదవా నీవిచ్చెదవా   

461. Vendi Bangaramula Kanna Yesuni Kaligi Yundedamu

       వెండి బంగారములకన్న 
       యేసుని కలిగి యుండెదమ
       వెలగల భూషణములకన్న 
       కల్వరి సిల్వ ధరించెదము

1.     అడవిరాజు తన పిల్లలను 
       లేమికలిగి ఆకలిగొనును
       దేవుని ఆశ్రిత జనులకు ఎపుడు 
       మేలులు కొదువై యుండవుగా

2.    మన ప్రభుండు మహదేవుండు 
       ఘన మహాత్యము గలరాజు
       రక్షణకర్త ప్రధాన కాపరి 
       ఆయన మేపెడి గొర్రెలము

3.    వారి గుర్రములు రధములను 
       బట్టి జనులు గర్వించెదరు

       మనమైతే మనదేవుని నీతి 
       న్యాయములను శ్లాఘించెదము

460. Yesuni Korakai Ila Jivincheda Bhasuramuga Nenanudinamu

యేసుని కొరకై యిల జీవించెద
భాసురముగ నేననుదినము
దోషములన్నియు బాపెను
మోక్షనివాసమున ప్రభు జేర్చునుగా

నాశనకరమగు గుంటలో నుండియు
మోసకరంబు యూబినుండి
నాశచే నిల పైకెత్తెను నన్ను
పిశాచి పధంబున దొలగించెన్

పలువిధముల పాపంబును జేసితి
వలదని ద్రోసితి వాక్యమును
కలుషము బాపెను కరుణను బిలచెను
సిలువలో నన్నాకర్షించెన్

అలయక సొలయక సాగిపోదును
వెలయగ నా ప్రభు మార్గములన్
కలిగెను నెమ్మది కలువరి గిరిలో
విలువగు రక్తము చిందించిన ప్రభు

శోధన బాధలు శ్రమలిల కల్గిన
ఆదుకొనును నా ప్రభువనిశం
వ్యాధులు లేములు మరణము వచ్చిన
నాధుడే నా నిరీక్షణగున్

బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు
గుప్తమైయున్నవి ప్రభునందు
అద్భుతముగ ప్రభువన్నియు
నొసగి దిద్దును నా బ్రతుకంతటిని

అర్పించెను తన ప్రాణము నాకై
రక్షించెను నా ప్రియ ప్రభువు
అర్పింతును నా యావజ్జీవము
రక్షకుడేసుని సేవింప

ప్రభునందానందింతును నిరతము
ప్రార్ధన విజ్ఞాపనములతో
విభుడే దీర్చును యిల నా చింతలు
అభయముతో స్తుతియింతు ప్రభున్

యౌవన జనమా యిదియే సమయము
యేసుని చాటను రారండి
పావన నామము పరిశుద్ధ నామము
జీవపు మార్గము ప్రచురింపన్

459. Ma Ganam Ma Dhyanam Nikorake Swami

మాగానం మాధ్యానం నీకొరకే స్వామి
మా హృదయం మా సర్వం
నిను గొలుచుటకే స్వామి

పరలోకపు రాజా మా
మహిమాన్విత తేజ
ధర నరులను రక్షించుటకొచ్చిన
వరరూపుడవు నీవు

ప్రేమకు ప్రతిరూపం నీవు
ప్రతిపాపికి దీపం నీవు
ప్రపంచ భాగ్యవిధాతవు నీవు
ధరలో మరణ విజేతవు నీవు

458. Manasunna Manchideva Ni Manasunu Nakichava

మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా ||నా మది||

చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ||నా మది||

నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగ నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా ||నా మది||

457. Paravasini Ne Jagamuna Prabhuva

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను            ||పరవాసిని||     
లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వము
ఇలలో.. వ్యర్ధము సర్వమును         ||పరవాసిని||
ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే     ||పరవాసిని||
తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను       ||పరవాసిని||
ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే         ||పరవాసిని|| 
యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను           ||పరవాసిని||   
నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని|| 

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...