యేసుని కొరకై యిల జీవించెద
భాసురముగ నేననుదినము
దోషములన్నియు బాపెను
మోక్షనివాసమున ప్రభు జేర్చునుగా
నాశనకరమగు గుంటలో నుండియు
మోసకరంబు యూబినుండి
నాశచే నిల పైకెత్తెను నన్ను
పిశాచి పధంబున దొలగించెన్
పలువిధముల పాపంబును జేసితి
వలదని ద్రోసితి వాక్యమును
కలుషము బాపెను కరుణను బిలచెను
సిలువలో నన్నాకర్షించెన్
అలయక సొలయక సాగిపోదును
వెలయగ నా ప్రభు మార్గములన్
కలిగెను నెమ్మది కలువరి గిరిలో
విలువగు రక్తము చిందించిన ప్రభు
శోధన బాధలు శ్రమలిల కల్గిన
ఆదుకొనును నా ప్రభువనిశం
వ్యాధులు లేములు మరణము వచ్చిన
నాధుడే నా నిరీక్షణగున్
బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు
గుప్తమైయున్నవి ప్రభునందు
అద్భుతముగ ప్రభువన్నియు
నొసగి దిద్దును నా బ్రతుకంతటిని
అర్పించెను తన ప్రాణము నాకై
రక్షించెను నా ప్రియ ప్రభువు
అర్పింతును నా యావజ్జీవము
రక్షకుడేసుని సేవింప
ప్రభునందానందింతును నిరతము
ప్రార్ధన విజ్ఞాపనములతో
విభుడే దీర్చును యిల నా చింతలు
అభయముతో స్తుతియింతు ప్రభున్
యౌవన జనమా యిదియే సమయము
యేసుని చాటను రారండి
పావన నామము పరిశుద్ధ నామము
జీవపు మార్గము ప్రచురింపన్
Thanks for uploading
ReplyDelete5వ చరణం,4వ లైన్. బ్రతుకంతటిని అనుకుంటా..
ReplyDeletecorrected
DeletePlease upload 8th stanza too
ReplyDeletedone
Delete