Wednesday, 4 April 2018

470. Kalyanam Kamaneeyam

కల్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) 
ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయ్యా        ||దేవా||
కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే
అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా      ||దేవా||
బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా          ||దేవా||

469. Yesutho Tiviganu Podama

యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదము
రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవ చేయను
యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను 
విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై
యేసుతో ఠీవిగాను వెడలను           
శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను 
ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసురాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను
సాధనంబెవరు నీవు నేనెగా   

468.Yuvathi Yuvakulam Sahasavanthulam

యువతీ యువకులం - సాహసవంతులం
యేసుక్రీస్తు సాక్షులుగా
జీవింతుము జీవింతుము జీవింతుము

దుష్టునితో ధైర్యముగ పోరాడి గెలిచెదము
యేసే మా సేనాధిపతి - యేసే మా విజయగీతి

సాతాను మోసములు - ఎరుగని వారము కాము
దహించు అగ్ని మా ప్రభువు - కాల్చి కూల్చును అపవాదిని

467. Devuni Varasulam Prema Nivasulamu

 
దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము  
సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము 
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసుని చూపుదుము
దారుణ హింస లలో – దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము 
పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదము
అనుదిన కూటములు – అందరి గృహములలో
ఆనందముతోను – ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదము
హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో
నూతన లోకము కాంక్షింతుము 
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ
విభు మహిమను గాంచ విశ్వమే మము గోర
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసును జూపుదుము

466. Anthyadinamula yandu Athamnu

అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2)      ||అంత్య||

కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (2)      ||దేవా||

సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము (2)      ||దేవా||

సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా (2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము (2)      ||దేవా||

465. Halleluya Halleluya Halleluya Yesuke

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ యేసుకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్‌

1.     లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు  
       యేసు చాలు సాతానా నా వెనుకకు పో

2.    చాలు చాలు సోదొమ సంభ్రమ వైభంబులు
       పాలకుడై యేసు స్వామి పట్ల నేను చేరితిన్‌

3.    మేఘములపై భర్త క్రీస్తు వేగముగను రాగానే
       మేఘం మధ్యకు వెళ్ళి నేను హల్లెలూయ పాడెదన్‌

4.    స్తోత్రమనుచు పాడెదము జనక కుమారాత్మకు
       స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసుకే

Wednesday, 28 March 2018

464. Sarvadhikari Paramopakari Yesutho Nadichedamu

     సర్వాధికారి పరమోపకారి 
     యేసుతో నడిచెదము
     ఏ చోటుకైన ఏవేళనైన 
     క్రీస్తుతో వెళ్ళెదము

1.   కష్టాల లోయలో కన్నీటి నిశిలో 
     కీర్తించి పాడెదము
     నష్టాల ఊబిలో నన్నాదుకున్న 
     యేసుతో నడిచెదము   

2.  నా పాప భారం తొలగించినాడు 
     నా ప్రభువు నజరేయుడు
     నా ఊపిరైన నా కాపరైన 
     యేసుతో నడిచెదము  

3. ఏ మంచి నాలో లేకున్న వేళ 
    నన్నెంతో ప్రేమించెను
    ప్రేమించి నాకై మరణించినాడు 
    యేసుతో నడిచెదము   

4. దివి నుండి భువికి దిగివచ్చియేసు 
    నన్నెంత దీవించెను
    భువి నుండి దివికి వెళ్ళిన క్రీస్తు 
    త్వరలోనే దిగి వచ్చును

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...