Wednesday, 4 April 2018

470. Kalyanam Kamaneeyam

కల్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) 
ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయ్యా        ||దేవా||
కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే
అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా      ||దేవా||
బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా          ||దేవా||

No comments:

Post a Comment

Preminthunu Prabhuva Ninnu Lyrics | ప్రేమింతును ప్రభువా నిన్ను | Telugu Christian Song Lyrics # 609

ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...