పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా
స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఈయవా
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా
లోయలెల్ల పూడ్చబడాలి
కొండలు కోనలు కదలిపోవాలి
వక్రమార్గము సక్రమవ్వాలి
కరకు మార్గం నునుపవ్వాలి ||2||
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం
ఫలం ఇవ్వని చెట్టులెల్ల
నరకబడి - అగ్నిలో వేయబడును
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం
గోధుమలను వేర్పరచి గింజలను చేర్చి
పొట్టును నిప్పులో కాల్చి వేయును
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం
పరిశుద్ధులుగా కక్ష్యలు లేక
ప్రభుకై జీవించి సాగిపోదాం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం
రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం
అభిషేక తైలముతో నింపబడెదం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం