వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది
అధమమొక్క పాపమైన - అంటకుండ నున్నది
అంటనీయకున్నది అంటు అంటనుచున్నది
వరుని ప్రేమ స్మరణతోనే - పరిపూర్ణమౌచున్నది
వరుని మీదనున్న ప్రేమ-పెరగనిచ్చుచున్నది
తరగనీయకున్నది-వరుడు వరుడను చున్నది
'త్వరగ' ననగా గురుతులైన - తరువాత అనుచున్నది
గురుతులు జరిగిన దొంతి - గురుతు పెట్టుచున్నది
వరుని గురుతున నున్నది - గురుతు గురుతనుచున్నది
'త్వరగనన్నది' నరునియాత్మకు - ప్రవచనమనుచున్నది
ఇరువదివందల యేండ్లయినను - 'త్వరగ'నే యనుచున్నది
వధువు సిద్ధమనచున్నది - వధువు వధువనుచున్నది
గురుతులను ప్రవచనములను - గణియించుచున్నది
సరిగనున్నవి రెండుననుచు - మురియుచునే యున్నది
తరచు తరచు చున్నది - సరియె సరియనుచున్నది
ఆడితప్పనివాడు రాక - అట్టేయుండడనుచున్నది
నేడు వచ్చి వేసినట్టే - పాడుకొనుచున్నది
కీడు చూడకున్నది నేడు నేడనుచున్నది
వరుడు వధువు నొక్కటే గనుక త్వరగా నిజమనుచున్నది
'త్వరగ'లో ఇద్దరు దంపతులుగా బరుగు చుండ్రనుచున్నది
నిరుకు బ్రతుకనుచున్నది - నిరుకు నిరుకనుచున్నది
'త్వరగ' కడ్డులు లేవను నర్ధము విరివిగా చెప్పుచున్నది
నరులు నపవాదియు నడ్డు పరుపలేరనుచున్నది
వరుడడిగో యనుచున్నది పాపహరుడనుచున్నది
తేదిరాక కున్నదన్న లేదు లేదనుచున్నది తేది అపుడు
తెలియు నన్న - తెలియనగు ననుచున్నది కాదు
ఇపుడనుచున్నది తేది తేదియనుచున్నది
చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదె యనుచున్నది
ఆయత్తమౌనాటికి తేది - అందుననుచున్నది
మాయలేదనుచున్నది హాయి హయి యనుచున్నది
ఇక్కడను పైనక్కడను - ఒక్క కుటుంబమే యగును
లెక్కకు రెండగును మరిమొక - లెక్కకు నొక్కియే యగును
ఒక్కియే మందయగును - ఒకియే సంఘమగును
Tq
ReplyDelete