యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ ||
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ ||
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ ||