Wednesday, 31 August 2016

251. Papameruganatti Prabhuni

పాపమెరుగనట్టి ప్రభుని - బాధపెట్టిరి
శాపవాక్యములను బల్కి - శ్రమలు బెట్టిరి

దరికి వచ్చు వారి జూచి - దాగడాయెను
వెరువకుండ వెళ్ళి తన్ను- వెల్లడించెను.

నిరపరాధియైున తండ్రిని - నిలువ బెట్టిరి
దొరతనము వారి యెదుట - పరిహసించిరి.

తిట్టినను మరల వారిని - తిట్టడాయెను
కొట్టినను మరల వారిని - కొట్టడాయెను.

తన్ను జంపు జనుల యెడల - దయను జూపెను
చెన్నగ దొంగను రక్షింప - చేయి చాపెను.

కాలువలుగ రక్త మెల్ల - గారుచుండెను
పాలకుండౌ యేసు- జాలి బారుచుండెను.


250. Thala Dachukonutaku Needa Ila leni Galaliyavada

తలదాచుకొనుటకు నీడ - ఇలలేని గలలియవాడ
కలకాలమిక నీ కోట - సిలువేన నా చెలికాడ
పరలోక సుఖమును వీడి - నరలోక కరవులమాడి
నిరుపేదగను జీవించి - శరణంబు నొసగితివయ్య       ||తల||

ప్రతిపూట తినుటకు లేక - గతిలేని తెరువరి వోలె
వెతలొందుచునె నడియాడి - హతమార్చితివా నా లేమి
దినమంత తీరికలేని - పనిలోక ప్రజలను గాచి
కనుమూయ కొండలకేగి - కనుగొంటివా నీ పాన్పు      ||తల||

కరకైన బాటలపైన - చురుకైన అడుగులు వేసి
తిరుగాడి గూర్చితి నాకై - విశ్రాంతి గల నీ మార్గం
నిర్వాసిగనె జీవించి - పరలోక జనకుని ఇంట
చిరవాసము మాకీయ - నిర్మింప చనితివ దేవ        ||తల||

249. Kalvari Premanu Thalanchinapudu Kaluguchunnadi Dukham

కల్వరి ప్రేమను తలంచినపుడు 

కలుగుచున్నది దుఃఖం

ప్రభువా నీ శ్రమలను ధ్యానించినపుడు

పగులుచున్నది హృదయం

గెత్సేమనే ఒక తోటలో 

విలపించుచు ప్రార్ధించు ధ్వని

నలువైపుల వినబడుచున్నది 

పగులుచున్నది మా హృదయంబె

కలుగుచున్నది దుఃఖం

మమ్మును నీవలె మార్చుటకై 

నీ జీవమును యిచ్చితివే

నేల మట్టుకు తగ్గించుకొని 

సమర్పించితివి నీ కరములలో

మమ్మును నడిపించుము

248. Edu Matalu Palikinava

ఏడు మాటలు పలికినావా = ప్రభువ - ఏడు ముఖ్యాంశములు - ఎరుక
పరచితివా

1. దేవుండవు కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్‌ - క్షమియింప
గలవా = జీవమై యుండని యెడల - నిన్ను - చావు దెబ్బలు గొట్ట
- సహియింప గలవా (లూకా 23:34)

2. రక్షణ కథ నడిపినావా - ఒకరిన్‌ - రక్షించి పరదైసు - కొనిపోయినావా
= శిక్షితునికి బోధింపకనే - శాంతి - లక్షణము చూపుచు -
రక్షించినావా (లూకా 23:43)

3. తల్లికి నొక సంరక్షకుని - నిచ్చి - ఎల్లకరకు మాదిరి - కనపరచినావా
= తల్లికి సృష్టికర్తవై - ప్రేమ తనయుండవై గౌర - వించి యున్నావా
(యోహాను 19:26, 27)

4. నరుడవు కాకున్న యెడల - దేవ - నన్నేల విడిచితి - వని యడిగినావా
= నరుడవును దేవుండవును - గాన - నా పూర్ణ రక్షకుడ - వని
ఋజువైనావా (మార్కు 15:34)

5. ఎన్నిక జనుల ద్వేషంబు - నీకు - ఎండ యైునందున - దప్పి
గొన్నావా = ఉన్న యెండకును బాధకును - జిహ్వ - కూట లేనందున
- దాహమన్నావా (యోహాను 19:28)

6. పాపుల రక్షణ కొరకు - చేయ - వలసిన పనులెల్ల - ముగియించినావా
= పగలు పగవారి - తుదకు - అంతము కాగా సమాప్త మన్నావా
(యోహాను 19:30)

7. కనుక నీ యాత్మన్మరణమున - నీదు - జనకుని చేతుల -
కప్పగించితివా = జనులందరును యీ పద్ధతినే - ను -
అనుసరించునట్లు - అట్లు చేసితివా (లూకా 23:46)

247. Entha Goppa Bobba Puttenu

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - దానితో రక్షణ యంతయును సమాప్త

మాయెను = ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు 

గల్వరి మెట్టను సంతసముతో సిల్వ గొట్టగ - 

సూర్యుండంధకార మాయెను

గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడమును కట్టు

నప్పుడు = పలుకు భాషయు - నొక్కటైనను - పలువిధములగు

భాషలాయెను - నలు దెసలకును - జనులు పోయిరి కలువరి

కలుసుకొనిరి

పావనుండగు ప్రభువు మన కొరకై - యా సిలువ మీద చావు 

నొందెడు = సమయమందున - దేవుడ నా దేవుడ - నన్నేల 

చెయి విడిచితివి యని యా - రావముగ మొరబెట్టెను 

యె - హోవయను దన తండ్రితోన

అందు దిమిరము క్రమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత

చుట్టెను బంధకంబులు - నింద వాయువులెన్నో వీచెను కందు 

యేసుని యావరించెను - పందెముగ నొక కాటు వేసెను - 

పాత సర్పము ప్రభువు యేసును

సొంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు తన - స్వంత

విలువగు ప్రాణమును వీడెన్‌ - ఇంతలో నొక భటుడు 

తనదగు నీటెతో ప్రభు ప్రక్కబొడువగ - చెంత చేరెడి

పాపులను రక్షించు రక్తపు ధార గారను

246. Aha Mahatmaha Sarnya

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా         ||ఆహా||

వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై         ||ఆహా||

నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి           ||ఆహా||

అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి         ||ఆహా||

నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా     ||ఆహా||

దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా         ||ఆహా||

శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా   ||ఆహా||

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా          ||ఆహా||

245. Amulya Rakthamu dwara Rakshana pondina janulara

అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా

సర్వశక్తుని ప్రజలారా - పరిశుద్ధులారా పాడెదము

ఘనతా మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితముల్‌ - శరీరాశకు లోబరచి

చెడు మాటలను బలుకుచు - శాంతిలేక యుంటిమి

చెడుమార్గమున పోతిమి - దాని యంతము మరణము

నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి

నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక

స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి

కనికరము గల దేవుడు - మానవ రూపము దాల్చెను

ప్రాణము సిలువను బలిచేసి - మనల విమోచించెను

తన రక్త ధారలలో - మన పాపములను కడిగి

మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో

పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ

కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము

మన రక్షకుని స్తుతించెదము మనలను జేసెను ధన్యులుగా

మన దేవుని కర్పించెదము - ఆత్మ జీవ శరీరములన్‌

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...