ఏడు మాటలు పలికినావా =
ప్రభువ - ఏడు ముఖ్యాంశములు - ఎరుక
పరచితివా
1. దేవుండవు
కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్ - క్షమియింప
గలవా
= జీవమై యుండని యెడల
- నిన్ను - చావు దెబ్బలు గొట్ట
- సహియింప
గలవా (లూకా 23:34)
2. రక్షణ
కథ నడిపినావా - ఒకరిన్ - రక్షించి పరదైసు - కొనిపోయినావా
= శిక్షితునికి బోధింపకనే - శాంతి - లక్షణము చూపుచు -
రక్షించినావా
(లూకా 23:43)
3. తల్లికి
నొక సంరక్షకుని - నిచ్చి - ఎల్లకరకు మాదిరి - కనపరచినావా
= తల్లికి సృష్టికర్తవై - ప్రేమ తనయుండవై గౌర
- వించి యున్నావా
(యోహాను
19:26, 27)
4. నరుడవు
కాకున్న యెడల - దేవ - నన్నేల విడిచితి
- వని యడిగినావా
= నరుడవును దేవుండవును - గాన - నా పూర్ణ
రక్షకుడ - వని
ఋజువైనావా
(మార్కు 15:34)
5. ఎన్నిక
జనుల ద్వేషంబు - నీకు - ఎండ యైునందున - దప్పి
గొన్నావా
= ఉన్న యెండకును బాధకును
- జిహ్వ - కూట లేనందున
- దాహమన్నావా
(యోహాను 19:28)
6. పాపుల
రక్షణ కొరకు - చేయ - వలసిన పనులెల్ల
- ముగియించినావా
= ఆ పగలు పగవారి
- తుదకు - అంతము కాగా సమాప్త
మన్నావా
(యోహాను
19:30)
7. కనుక
నీ యాత్మన్ మరణమున - నీదు - జనకుని చేతుల -
కప్పగించితివా
= జనులందరును యీ పద్ధతినే - కడను -
అనుసరించునట్లు
- అట్లు చేసితివా (లూకా 23:46)
No comments:
Post a Comment