Wednesday, 4 April 2018
497. Ma Nanna Intiki Nenu Vellali
మా నాన్న ఇంటికి నేను వెళ్లాలి
మా తండ్రి యేసుని నేను చూడాలి
మా నాన్న ఇంటిలో సంతోషమున్నది
మా నాన్న ఇంటిలో ఆదరణ యున్నది
మా నాన్న ఇంటిలో నాట్యమున్నది
మగ్ధలేనె మరియలాగ
నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెండ్రుకలతో తుడిచెదను
బేతనియ మరియలాగ
నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానింతును
ఎడతెగక నీ సన్నిధి చేరెదను
నీదివ్య సన్నిధి నాకు
మధురముగా ఉన్నదయ్యా
ఈ లోకమును నేను మరచెదను
పరలోక ఆనందము పొందెదను
496. Priya Yesu Rajunu Ne Chuchina Chalu
మహిమలో నేనాయనతో ఉంటే చాలు
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు
వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను
బంగారు వీదులలో తిరిగెదను
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్
నా భాగ్య గృహమును స్మరించుచు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో
ఆశతో వేచియుండే నా హృదయం
495. Parishudha Simhasanam Nidu Nivasa Sthalamu
పరిశుద్ధ సింహాసనం
నీదు నివాస స్థలము
ఈ భూమి నీ పాదపీఠం
ఈ సృష్టి నీ చేతి పనియే
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
సెరాపులు కెరూబులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
చేయు ప్రతిగానములకు
నీవె యోగ్యుడవయ్యా
మార్గమును సత్యమును
జీవమునైయున్న మా దేవా
మాదు హృదయమే నీదు ఆలయమం
మాలోన వసియించు ప్రభువా
అల్ఫయును ఓమేగయును
యుగయుగములకు సజీవుడవు
ఆకాశ భూమి గతించినను
నీవే మా దేవుడవయ్యా
494. Pakshiraju vale Rekkalu Chapi Paikeguruduma
పక్షిరాజువలె రెక్కలు
చాపి పైకెగురుదామా
అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా
ఆ శాశ్వత లోకము కొరకు
నిత్యరాజ్యము కొరకు
ఈ లోక స్నేహితులు
ఈ లోక బంధువులు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
ఎవరులేక ఒంటరిస్థితిలో
ప్రేమలన్ని కోల్పోయినా క్రీస్తేసు
ప్రేమలో సాగిపోదమా
ఈ లోక పోరాటము సాతాను శోధనలు
హృదయమును కృంగదీసినా
అడుగడుగున
సంకెళ్ళతో అడుగువేయలేకున్నా
క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా
ఆ మహిమ రాజ్యములో
ఆ నిత్య రాజ్యములో
కన్నీరుండదు దిగు లుండదు
ఎల్లప్పుడు సంతోషముతో ఎల్లప్పుడ
ు
ఆనందముతో హల్లేలూయా
గీతాలతో నిలిచిపోదుమా