Tuesday, 30 March 2021

563. Nuthanamainadi Nee Vathsalyamu

నూతమైనది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను..
తరములు మారుచున్నను దినములు
గడుచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు..
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును..||2|| ||నూతన||

గడచినకాలమంత నీ కృప
చూపి ఆదరించినావు
జరగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు..||2||
విడువని దేవుడవు యెడబాయలేదు
నన్ను క్షణమైనా త్రోసివేయవు..||2|| ||సన్ను||

నా హీనదశలో నీ ప్రేమ
చూపి పైకి లేపినావు.
ఉన్నత స్థలములో నన్ను
నిలువబెట్టి ధైర్యపరచినావు..||2||
మరువని దేవుడవు
నన్ను మరువలేదు నీవు
ఏ సమయమందైనను
చేయి విడువవు..||2||. || సన్ను||

నీ రెక్కలక్రింద నన్ను
దాచినావు ఆశ్రయమైనావు..
నా దాగుస్థలముగా నీవుండినావు
సంరక్షిం చావు...||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు
నన్ను సమయోచితముగా
ఆదరించినావు ||2||. .. || సన్ను ||

1 comment:

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591 Song No: 591 Language: Telugu Category: Worship Song 🎵 Te...