గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ
జయ మార్భటించెదము
చూడు సమాధిని
మూసినరాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలినిల్చెను
నా - దైవ సుతుని ముందు || గీతం||
వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి || గీతం||
అన్న కయప వారల
సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని
వినుచు - వణకుచు భయపడిరి || గీతం||
గుమ్మముల్ తెరచి చక్కగ
నడువుడి జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్
బూరలెత్తి ధ్వనించుడి || గీతం||
Hii
ReplyDeleteNice Blog
Guys you can visit here to know about
youtube ghazals song video
Nice blog informative Download
ReplyDeleteఈ పాట రచయిత ఎవరో తెలియదు.గొప్పగా వ్రాశాడు .నమస్కారం 🙏
ReplyDeleteతెలుగు అనువాదకుడు కూడా తెలియదు. భారతీయ భాషాలన్నీటిలో ఈ గీతం గీతం పాట పాడుతున్నారు.క్రైస్తవ పాటల రచయితలు అనువాదకుల పేర్లు కూడా నమోదు చెయ్యాలి.
తమిళ,మలయాళ భాషల్లో అనువాదకుడుమాత్రం M. E. Cheriyan ,చెరియన్ అని తెలిసింది