Index-Telugu

Wednesday 24 July 2024

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన
దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన
ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును
ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును
సంతోషపరచును (2) ||తొలకరి||

ఎడారి వంటి బ్రతుకును
సారముగా చేయును
జీవజలముతో నింపి
జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు
సమృద్ధితో నింపును (2) ||అది నూతన||

సత్యస్వరూపి శుద్ధాత్మా
నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి
నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా
సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||

584. Nee Sannidhilo Unnamu Nee Vaipu Chuchuchunnamu

నీ సన్నిధిలో ఉన్నాము
నీ వైపు చూచు చున్నాము 
II 2 II 
ఆత్మరూపి యేసునాథ
ఆశీర్వదించుము మమ్ము
ఆశీర్వదించుము          
II నీ II

దీనులను కరుణించు
కారుణ్య శీలుడా
యేసయ్య కారుణ్య శీలుడా II నీ II

కలుషాత్ములను ప్రేమించు
ప్రేమస్వరూపుడా
యేసయ్య ప్రేమస్వరూపుడా II నీ II

నీ నామమును స్మరియించగానే
దిగిరమ్ము దేవదేవా
యేసయ్య దిగిరమ్ము దేవదేవా II నీ II

Monday 15 July 2024

583. Nenante Entha Premo Aa Prema Moorthiki

నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ మూర్తికి
నా కొరకే సిలువనెక్కే నా కలువరినాధునికి
యేసు రక్తమే జయం - సిలువ రక్తమే జయం యి II 4 II

కలువరి రుధిరములో కడుగబడిన శిలను 
నీ రక్త ప్రవాహములో సిలువ చెంత చేరాను 
నీ ప్రేమే మార్చిందయా... నన్నిలా.. 
ఆ ప్రేమకు బానిసగా మారానయ్యా II 2 II నేనంటే II

నను రక్షించుటకు నీ ప్రాణమర్పింప
వెనుకాడలేదుగా నా యేసయ్య
నా శిక్ష భరియించి శాపము తొలగించి
నా స్థానములో నీవు బలియైతివా
ప్రియమని ఎంచలేదుగా నీ ప్రాణమును
నా ఆత్మ విలువ నీవు యోచించితివా II 2 II నేనంటే II

Tuesday 2 July 2024

582. Aradhana Chetunu Anni Velala

ఆరాధన చేతును అన్ని వేళలా....
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు ....
నన్ను కన్న తండ్రి నా యేసుకు...... " 2
" స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన......
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన.... "2"
ఆరాధన .....ఆరాధన..... ఆరాధన..... ఆరాధన...."2"
ఆరాధనా ............ఆరాధనా........... "2"

నీతి సూర్యుడా.. నిజమైన దేవుడా....
సర్వోన్నతుడ ... సర్వ శక్తి మంతుడా... "2"
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిను తప్ప వెరేవరిని పూజింతునయా .. "2"
నిత్యము నీ నామమునే స్తుతియించేదను "స్తుతి స్తుతి"

బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవన దాతా ..."2"
ఉన్నవాడు అనువాడ నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము.... "2"
స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము .. "2" "స్తుతి స్తుతి"