Friday, 5 August 2016

142. Gadachina Kalamu Krupalo Mammu Dachina Deva

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)        ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)       ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2)        ||గడచిన||


141. Kuthuhalamarbatame Na Yesuni Sannidhilo

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)         

పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2)                  ||కుతూహలం ||

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను 
అద్భుత మద్భుతమే (2)            ||కుతూహలం||

శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2)              ||కుతూహలం||

బూరధ్వనితో పరిశుద్ధులతో
యేసు రానైయుండే
ఒక్క క్షణములోనే - రూపాంతరము పొంది
మహిమలో ప్రవేశిద్దాం (2)              ||కుతూహలం||

140. Emundi Nalo Ni Parisudhatha Lede

ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే 
అయినా నను ప్రేమించితివే 
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను మురిపించావు

1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||

2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||

139. Ella velalandu Kasta Kalamandu

ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‌ (2)

విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్ల||

సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)    ||ఎల్ల||

జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే (2)  ||ఎల్ల||

జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్ల||

నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)  ||ఎల్ల||

జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే (2)      ||ఎల్ల||

కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే (2)   ||ఎల్ల||

138. Oohinchaleni Melulatho Nimpina Yesayya

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

137. Udayamayenu Hrudayama Prabhu Yesuni Prardhinchave

ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే (2)
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే (2)        ||ఉదయమాయె||

రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే (2)
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే (2)        ||ఉదయమాయె||

తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే (2)
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే (2)        ||ఉదయమాయె||

పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా (2)
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా (2)        ||ఉదయమాయె||

తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని (2)
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా (2)        ||ఉదయమాయె||

136. Inthakalam Nidu Krupalo Kachina Deva

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)       

నీవు చేసిన మేళ్లను – తలచుకొందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)         

దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితుల్ (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)          

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...