దేవదూతల బాషలతో
నేను మాట్లాడినా మాట్లాడినా
ప్రవచించు వరంబులు నాకుండినా
ప్రేమ లేని వాడనైతే వట్టివాడనే
ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించినా ప్రేమ ఇదే
కొండలను నేను పెకలించినా
బండలు బ్రద్దలుగా జేసినా
ఆకాశంబు పై కెగిరిపోయినను
ప్రేమ లేని వాడనైతే వట్టివాడనే || ఇదియే ||
లోకమంతయు నాకుండినా
కొదువ ఏమియు నాకు లేకుండినా
అందరిని మించు అందంబు నాకుండినా
ప్రేమ లేని వాడనైతే వట్టివాడనే || ఇదియే ||
ఎంతో విద్యను అభ్యసించి
ఎంతో ఔన్నత్యముగ నేనుండినన్
గొప్ప పదవులతో నేను తిరిగినను
ప్రేమ లేని వాడనైతే వట్టివాడనే || ఇదియే ||