Saturday, 6 August 2016

162. Thallila Lalinchunu Thandrila Preminchunu

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా        ||తల్లిలా||

తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||

పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.