Saturday, 6 August 2016

161. Junte Thene Kanna Thiyanidi Vendi Pasidi Kanna

జుంటె తేనె కన్న తీయనిది
వెండి పసిడి కన్న మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది
యేసు నీ నామము

సూర్య కాంతి కన్న ప్రకాశమైనది
పండు వెన్నెల కన్న నిర్మలమైనది
మంచు కొండల కన్న చల్లనిది
యేసు నీ నామము

యేసు అసాధ్యుడవు నీవు
మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్నీ శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు

రక్షకా నీవేగా మా బలము
దేవా మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మ్రొక్కెదము           ||జుంటె||

ఆకాశము కన్న విశాలమైనది
విశ్వమంతటిలో వ్యాపించియున్నది
ఊహలకందని ఉన్నతమైనది
యేసు నీ నామము

లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము
సర్వ కాలములో నివసించు సత్యము
యేసు నీ నామము         ||జుంటె||

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...