Wednesday, 31 August 2016

246. Aha Mahatmaha Sarnya

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా         ||ఆహా||

వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై         ||ఆహా||

నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి           ||ఆహా||

అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి         ||ఆహా||

నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా     ||ఆహా||

దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా         ||ఆహా||

శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా   ||ఆహా||

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా          ||ఆహా||

245. Amulya Rakthamu dwara Rakshana pondina janulara

అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా

సర్వశక్తుని ప్రజలారా - పరిశుద్ధులారా పాడెదము

ఘనతా మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితముల్‌ - శరీరాశకు లోబరచి

చెడు మాటలను బలుకుచు - శాంతిలేక యుంటిమి

చెడుమార్గమున పోతిమి - దాని యంతము మరణము

నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి

నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక

స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి

కనికరము గల దేవుడు - మానవ రూపము దాల్చెను

ప్రాణము సిలువను బలిచేసి - మనల విమోచించెను

తన రక్త ధారలలో - మన పాపములను కడిగి

మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో

పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ

కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము

మన రక్షకుని స్తుతించెదము మనలను జేసెను ధన్యులుగా

మన దేవుని కర్పించెదము - ఆత్మ జీవ శరీరములన్‌

244. Adigadigo Alladigo Kalvari Mettaku Daradigo

అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో||

గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
అచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో||

శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో||

లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో||

చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
మూడవసారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో||

యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే (2)
నీలో దోషము కనుగొనలేక (2)
చేతులు కడిగిన పిలాతుడాడుగో (2)       ||అదిగదిగో||

గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2)       ||అదిగదిగో||

గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2)       ||అదిగదిగో||

దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2)       ||అదిగదిగో||

243. Vandanambonarthumo Prabho Prabho

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనం బోనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయు శుద్ధాత్ముడ
వందనంబు లందుకో ప్రభో

ఇన్నినాళ్లు ధరను మమ్ము బ్రోచియు
గన్నతండ్రి మించి యెపుడు గాచియు
ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా
యన్నిరెట్లు స్తోత్రములివిగో

ప్రాత వత్సరంపు బాప మంతయు
భీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగు మా
దాత క్రీస్తు నాధ రక్షకా

దేవ మాదు కాలుసేతు లెల్లను
సేపకాళి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా

కోత కొరకు దాసజనము నంపుము
ఈ ధరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబులెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడ

మా సభలను పెద్దజేసి పంచుము  
నీ సువార్త జెప్పశక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంతద్రోయుము
యేసుకృపన్‌ గుమ్మరించుము

242. Krotha Yedu Modalubettenu

క్రొత్తయేడు మొదలుబెట్టెను - మన బ్రతుకునందు
క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభునిసేవ - దత్తర
పకుండజేయు - టుత్తమోత్తంబుడ

1. పొందియున్న మేలులన్నియు బింకంబుమీర - డెందమందు
స్మరణజేయుడి - యిందు మీరు మొదలుపెట్టు పందెమందు
బారవలయు - నందము - గను రవినిబోలి - నలయకుండ
సొలయకుండ

2. మేలుసేయ - దవొనర్పగా - మీరెరుగునట్లు - కాలమంత నిరుడు
గచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు

3. బలములేని వారమయ్యును - బలమొందవచ్చు గలిమి మీర
గర్త వాక్కున - నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదమొంది
ఫలమొసంగు సర్వవిధుల - నెలమి మీ రోనర్చుచుండ

4. ఇద్దిరిత్రి నుండనప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి పొంద
డవలయును - బుద్ధి నీతి శుద్ధులందు - వృద్ధి నొంద శ్రద్ధ
జేయు - శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు

5. పాప పంకమింనప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుజేరి
మీరు వేగా - నేపు మీరదనదు కరుణ - బాపమంత గిగి
వేసి - పాపరోగ చిహ్నలన్ని బాపివేసి శుద్ధిజేయు

Wednesday, 24 August 2016

241. Sudhamadhura Kiranala Arunodayam

సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణమరుణోదయం
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది

1. దివిరాజుగా భువికి దిగినాడని
రవిరాజుగా ఇలలో మిగిలాడని
నవలోక గగనాలు తెరిచాడని
పరలోక భువనాలు పిలిచాడని
తీరని జీవన జ్యోతిగ వెలిగే తారొకొటొచ్చింది
పాడె పాటలు పశువుల శాలను ఊయల చేసింది
జన్మమే ఒక మర్మము బంధమే అనుబంధము

2. లోకాలలో పాప శోకాలలో
ఏకాకిలా బ్రతుకు అవివేకులు
క్షమ హృదయ సహనాలు సమపాలుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్థిగ
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసే
నిత్యసుఖాల జీవజలాల పెన్నిధి ప్రభువే
నిను కావగా నిరుపేదగా జన్మించెగా ఇల పండుగా

240. Sri Yesundu Janminche Reyilo

శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో

1. కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున

2. సత్రమందున పశువుల శాలయందున
దేవపుత్రుండు మనుజుండాయెనందున

3. వట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్పవార్త దూత చల్లగా

5. మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషముల బోగొట్టెను

6. పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను

7. అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...