Saturday, 22 October 2016

269. Vijaya Geethamu Manasara Nenu Padeda

విజయగీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన

ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో ||పునరు||

ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది ||పునరు||

నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే
నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||పునరు||

268. Randi Viswasulara

రండు విశ్వాసులారా-రండు విజయము
సూచించు - చుండెడు సంతోషంబును
గల్గి - మెండుగ నెత్తుడి రాగముల్
నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు
విజయం విజయం విజయం విజయం విజయం

నేటి దివస మన్ని యాత్మలకును
నీటగు వసంత ఋతువగును
వాటముగ చెరసాలను గెలిచె
వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్
విజయం విజయం విజయం విజయం విజయం

కన్ను కన్ను కానని చీకటి
కాలము క్రీస్తుని కాంతిచే - ఇన్నాళ్ళకు
శీఘ్రముగా బోవు - చున్నది శ్రీయేసుని
కెన్నాళ్ళ కాగని - మన సన్నుతుల్ భువిన్
విజయం విజయం విజయం విజయం విజయం

బలమగు మరణ ద్వార బంధములు
నిన్ బట్టకపోయెను - వెలుతురు
లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక
పోయెను గెలువ వాయెను
విజయం విజయం విజయం విజయం విజయం

పన్నిద్దరి లోపల నీ వేళ-సన్నుతముగ
నీవు నిలిచి-యున్నావు మానవుల
తెలివి - కెన్నడైన నందని = ఔన్నత్య
శాంతిని అనుగ్రహింతువు
విజయం విజయం విజయం విజయం విజయం

267. Yuda Raja Simham Thirigi Lechenu

యూదా రాజ సింహం - తిరిగి లేచెను
తిరిగి లేచెను - మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం - యేసుప్రభువే
యేసుప్రభువే - మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం - తిరిగి లేచెను

నరక శక్తులన్నీ - ఓడిపోయెను
ఓడిపోయెను - అవన్నీ రాలిపోయెను

యేసు లేచెనని -రూఢియాయెను
రూడియాయెను - సమాధి ఖాళీ ఆయెను

పునరుత్థానుడిక - మరణించడు
మరణించడు - మరెన్నడు మరణించడు

యేసు త్వరలో - రానైయున్నాడు
రానైయున్నాడు - మరల రానైయున్నాడు

266. Marananni Gelichina Deva Ninne Aradhinchedanayya

మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న

ప్రాణముతో గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న

ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
అభిషేకనాధుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న

పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న

పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న

265. Jayahe Jayahe Jayahe Jahaye

జయహే జయహే జయహే జయహే
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా

 1. సిలువలో పాపికి విడుదల కలిగెను - విడుదల కలిగెను
     కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను
    సిలువ పతాకము జయమును గూర్చెను
    జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

2.  మరణపు కోటలో మరణమె సమసెను - మరణమె సమసెను
     ధరణిలో జీవిత భయములు తీరెను - భయములు తీరెను
     మరణములో సహ జయములు నావే
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

3.  శోధనలో ప్రభు సన్నిధి దొరికెను - సన్నిధి దొరికెను
     వేదనలే రణభూమిగ మారెను - భూమిగ మారెను
     శోధన బాధలు బలమును గూర్చెను
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

4.  ప్రార్ధన కాలము బహు ప్రియమాయెను - బహు ప్రియమాయెను
     సార్ధక మాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము
     ప్రార్ధనలే బలిపీఠములాయెను
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

5.  పరిశుద్ధాత్ముని ప్రాపకమొదవెను - ప్రాపకమొదవెను
     వరుడగు యేసుని వధవుగా మరితి - వధువుగా మారితి
     పరిశుద్ధుడు నను సాక్షిగ పిలిచెను
     జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

264. Jayamu Keerthanalu Jaya Sabdamutho

జయము కీర్తనలు జయశబ్ధముతో రయముగా పాడండి
జయము జయమాయెను లెండి జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్

1.  యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే ఎల్లవారికౌను కోరిన యెల్లవారికౌను
    వేడిన యెల్లవారికౌను నమ్మిన యెల్లవారికౌను యేసుపేరే మీ చిక్కులపెన
    వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్

2.  జయము రాకపూర్వంబే జయమను జనులకు జయమౌను
     స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను
     ప్రకించు జనులకు జయమౌను జయము జయమని
     కలవరించిన జయమే బ్రతుకెల్ల ఇకనపజయ పదమే కల్ల సద్విలాస్

3.  అక్షయ దేహు దాల్చితి నీవు ఆనందమొందుమీ లక్షల కొలది
     శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమీ నీవు లక్ష్యము పెట్టకుమీ సద్విలాస్

4.  తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు తుక్కు తుక్కు
      అపాయమేమియు రాదు నీకు అదినీకులొక్కు నిజము
      అదినీకేలొక్కు సద్విలాస్

5.   వచ్చివేసిన దేవుని సభకు చేరుదము రండి త్వరలో యేసును
      కలిసికొని దొరలౌదము రండి నిజముగా దొరలౌదము రండి సద్విలాస్

Wednesday, 7 September 2016

263. Jaya Jaya Yesu Jaya Yesu

జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం       || జయ జయ ||

మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ క్రీస్తు (2)
పరమ బలమొసగు జయ యేసు (2)
శరణము నీవే జయ యేసు                || జయ జయ ||

సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు               || జయ జయ ||

సాతాన్ను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ క్రీస్తు (2)
పాతవి గతియించే జయ యేసు (2)
దాతవు నీవే జయ యేసు                  || జయ జయ ||

బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ క్రీస్తు (2)
బండలు దీయుము జయ యేసు (2)
అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||

ముద్రను గెల్చిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)
ముద్రలు జీల్చుము జయ యేసు (2)
ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||

కావలి గెల్చిన జయ యేసు
కావలి ఓడెను జయ క్రీస్తు (2)
సేవలో బలము జయ యేసు (2)
జీవము నీవే జయ యేసు                || జయ జయ ||

దయ్యాలు గెల్చిన జయ యేసు
దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)
కయ్యము గెల్చిన జయ యేసు (2)
సాయము నీవే జయ యేసు            || జయ జయ ||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...