Saturday, 22 October 2016

268. Randi Viswasulara

రండు విశ్వాసులారా-రండు విజయము
సూచించు - చుండెడు సంతోషంబును
గల్గి - మెండుగ నెత్తుడి రాగముల్
నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు
విజయం విజయం విజయం విజయం విజయం

నేటి దివస మన్ని యాత్మలకును
నీటగు వసంత ఋతువగును
వాటముగ చెరసాలను గెలిచె
వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్
విజయం విజయం విజయం విజయం విజయం

కన్ను కన్ను కానని చీకటి
కాలము క్రీస్తుని కాంతిచే - ఇన్నాళ్ళకు
శీఘ్రముగా బోవు - చున్నది శ్రీయేసుని
కెన్నాళ్ళ కాగని - మన సన్నుతుల్ భువిన్
విజయం విజయం విజయం విజయం విజయం

బలమగు మరణ ద్వార బంధములు
నిన్ బట్టకపోయెను - వెలుతురు
లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక
పోయెను గెలువ వాయెను
విజయం విజయం విజయం విజయం విజయం

పన్నిద్దరి లోపల నీ వేళ-సన్నుతముగ
నీవు నిలిచి-యున్నావు మానవుల
తెలివి - కెన్నడైన నందని = ఔన్నత్య
శాంతిని అనుగ్రహింతువు
విజయం విజయం విజయం విజయం విజయం

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...