నశియించు ఆత్మలను రక్షింప యేసుప్రభు
ఆశతో వెదుకుచును నీ కొరకేతెంచే
వేడుమ శరణు ఓ యువకా
కోరుమ శరణు ఓ యువతీ II నశియించుII
సిలువలో కారెనుగా - సెలయేరుగ రుధిరంబు
చాచిన చేతులతో - దావున చేరెనుగా
నీ సహవాసముకై - నిలిచెను వాకిటను
హృదయపు తలుపు – తీయుము II నశియించుII
ఈ యువతరమంతా - దేవుని సేవకులై
రక్షణ పొందగను - యేసుడు కోరెనుగా
సోమరివై సమయం - వ్యర్ధము చేయుదువా
క్రీస్తుకు నీహృది – నీయుమా II నశియించుII
యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
ఓ యువకా - ప్రభుని వేదన గాంచితివా
రయమున సాగుమయా - రక్షణ కోరుమయా
యేసుని శరణు – వేడుము II నశియించుII