Monday, 22 January 2018

313. Hrudayamanedu thalupu nodda yesu nadhundu



                హృదయమనెడు తలుపునొద్ద యేసునాధుండు
                నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను

1.            పరునిబోలి నిలుచున్నాడు పరికించి చూడ
               నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు

2.            కరుణాశీలుండతడు గాన గాచియున్నాడు
               యేసు కరుణ నెరుగి గారవింప గలము న్యాయంబు

3.            ఎంతసేపె నిలువబెట్టి యేడ్పింతురతని
               నాతడెంతో దయతో బిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను

4.            అతడు మిత్రుడతడు మిత్రుడఖిల పాపులకు
               మీరలతని పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును

5.            జాలిచేత తన హస్తముల జాపియున్నాడు
               మిమ్ము నాలింగనము సేయగోరి యనిశము కనిపెట్టు

6.            సాటిలేని దయగలవాడు సర్వేశ్వరసుతుడు
               తన మాట వినెడు వారినెల్ల సూిగ రక్షించు

7.            చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాధున్
               నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము గృపను

8.            అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు
               మీర లతని హత్తుకొందురప్పు డానందము తోడ

9.            బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ 
               గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొల్వండి

312. Sahodara Sahodari Saguma Prabhu Sevalo



                సహోదరా సహోదరీ సాగుమా ప్రభుసేవలో నిత్యమైన పధములో

1.            నీతిమంతురాలు రూతు - నిలిచి సాగిపోయెనే
               ఓర్పా యైతే మార్పు చెంది - మరలిపోయెను మార్గమిడిచి

2.            నీ జనంబే నా జనంబనియె - నీ దేవుడే నా దేవుడనియె
               మనసు కుదిరి మార్గమెరిగి - నడిచిపోయె నమోమితో

3.            అడుగు వాటికన్న ప్రభువు - అధికముగా దయచేయును
               అడిగె బోయజు నా సహోదరి - అతని దయను పొందెనే

4.            మన సహోదరి మనకు మాదిరి - మంచి సాక్ష్యము పొందెనె
               ఖ్యాతినొందె నీతిగలదై - ఎఫ్రాతా బెత్లేహేములో

5.            మోయబీయురాలు రూతు - యేసును పోలిన దాయెను
               ఆశ్రయించె ఆమె బోయజున్‌ - వర్ధిల్లె నిశ్రాయేల్వంశమున

6.            తల్లి నైనను తండ్రి నైనను - అన్నదమ్ముల నైనను 
               అన్ని విడిచి కన్న యేసుని - అడుగుజాడలో నడువుమా

311. Santhoshame Samadhaname



                సంతోషమే సమాధానమే     ||3||
                చెప్ప నశక్యమైన సంతోషం

1.            నా హృదయము వింతగ మారెను     
               నాలో యేసు వచ్చినందున

2.            తెరువబడెను నా మనోనేత్రము          
               యేసు నన్ను ముట్టినందున

3.            సంతోషం నీకు కావలెనా 
               నేడే యేసునొద్దకు రమ్ము

4.            సత్య సమాధానం నీకు కావలెనా
               నేడే యేసు నొద్దకు రమ్ము 

 5.           నిత్యజీవము నీకు కావలెనా
               నేడే యేసు నొద్దకు రమ్ము

6.            మోక్ష భాగ్యము నీకు కావలెనా 
            నేడే యేసు నొద్దకు రమ్ము

7.            యేసుక్రీస్తును నేడే చేర్చుకో 
               ప్రవేశించు నీ యుల్లమందు

310. Siluvanu Mosi Ee lokamunu talakrindulu cheyu tarunamide



                సిలువను మోసి యీ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదె

1.            లేలెమ్ము సోదరుడా నిద్రనుండి ప్రకింపను యేసు నామమును
               సోమరియేల నిద్రించెదవు ధరను లేపెడు సమయమిదే

2.            పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము క్టి తయారగుమా
               సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమమమిదె

3.            లోక రక్షణకై ప్రభుయేసు దీక్షతో నరుదెంచెను ధరకు
               వెలుగును మనకు యిచ్చెను యేసు ఘనస్తుతులను పాడెడు సమయమిదె

4.            పాతాళమునకు కొనిపోయెడి పాప నిద్రను విడనాడుమికన్ 
               సిలువ మర్మము నెరుగుమిపుడె కునికెడు సమయము గాదిది ప్రియుడా

309. Randi Suvartha Sunadamutho Ranjillu Siluva Ninadamutho

రండి సువార్త సునాదముతో
రంజిల్లు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభుయేసు దయానిధి సన్నిధికి

యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం
భాసుర క్రైస్తవ శుభనామం

యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం

యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ యధికారం
దాసుల ప్రార్ధన సహకారం

యేసే సంఘములో మనకాంతి
యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి
పసిపాపల దీవెనమూర్తి

యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జనస్తోత్రం

308. Randi Randi Yesuni Yoddaku Rammanuchunnadu

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన దొరకదు శాంతి ఆత్మకు నిలలో

కరవు రణము మరణము చూచి కలుగదు మారుమనస్సు
ప్రవచనము సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు

ప్రభుయేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై

యేసుని నామమునందే పరమ నివాసం దొరకును
ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును

నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని యొద్దకు

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...