Monday, 22 January 2018

326. Ne Papino Prabhuva Nanu Kavuma Deva

నే పాపినో ప్రభువా నను కావుమా దేవా ||4||

కరుణాలవాలా నీ మ్రోలనీల
తలవాల్చి నిలిచేనులే ||2||
దయజూడ గావ దురితాల ద్రోల
నీ సాటి దైవంబు వేరెవ్వరూ
వేరెవ్వరూ వేరెవ్వరూ                        II
నేII

ఉదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై ||2||
మోసేవు సిలువ నీ ప్రేమ విలువ
నా తరమా చెల్లించ నా యేసువా
నా యేసువా నా యేసువా              
IIనేII

325. Nadu Hrudayapu Dwaramu Therachedanu

నాదు హృదయపు ద్వారము తెరచెదను
యేసు పాపపు రోగికి నీవె గతి               
IIనాదుII

యేసు చచ్చిన వారిని లేపితివే
మరి కుంటికి కాళ్ళను యిచ్చితివే
నేను పాపిని రోగిని నీవే గతి
నాకు దిక్కులేదిక వేరెక్కడ                    
IIనాదుII

ప్రభు కుష్టును ప్రేమతో ముట్టితివి
మరి దుష్టుల చెంతకు చేరితివి
నాదు పాపపు కుష్టును పారద్రోలి
పరిశుభ్రత నియ్యుము నీవే గతి            
IIనాదుII

యేసు యాయీరు కుమార్తెను లేపితివి
మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ
నాకు వేరొక మార్గము లేదికను            
IIనాదుII

ప్రభు మార్గము ప్రక్కన కూర్చునిన
ఆ అంధుని ధ్వనిని వింటివిగా
నేను పాపిని అంధుని యేసుప్రభూ
నను దాటకు దిక్కిక లేరు ప్రభూ            
IIనాదుII

324. Natho Nivu Matladinacho Ne Brathikedanu Prabho

నాతో నీవు మ్లాడినచో
నే బ్రతికెదను ప్రభో ఆఆ
నా ప్రియుడా - నా హితుడా
నా ప్రాణ నాధుడా నా రక్షకా                        
IIనాతోII

తప్పిపోయినాను - తరలి తిరిగినాను
దొడ్డినుండి వేరై - హద్దు మీరినాను
లేదు నీదు స్వరము - నిన్ను అనుసరింప
ఎరుగనైతి మార్గం - లేదు నాకు గమ్యం
ఒక్కమాట చాలు - ఒక్కమాట చాలు
ఒక్కమాట చాలు ప్రభో                                
IIనాతోII

చచ్చియుంటి నేను - చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో - బండరాతి మాటున్
కానలేను నిన్ను - కానరాదు గమ్యం
లేదు నీదు పలుకు - నాకు బ్రతుకు నీయన్
ఒక్కమాట చాలు - ఒక్కమాట చాలు
ఒక్కమాట చాలు ప్రభో                                
IIనాతోII

యుద్ధమందు నేను - మిద్దెమీదనుండి
చూడరాని దృశ్యం - కనులగాంచినాను
బుద్ది వీడినాను - హద్దు మీరినాను
లేదు నాలో జీవం - ఎరుగనైతి మార్గం
ఒక్కమాట చాలు - ఒక్కమాట చాలు
ఒక్కమాట చాలు ప్రభో                            
IIనాతోII

కట్టబడితి నేను - గట్టి త్రాళ్ళతోను
వీడె నీదు ఆత్మ - వీడె నాదు వ్రతము
గ్రుడ్డివాడనైతి - గాను గీడ్చుచుంటి
దిక్కులేక నే నీ - దయను కోరుచుంటి
ఒక్కమాట చాలు - ఒక్కమాట చాలు
ఒక్కమాట చాలు ప్రభో                            
IIనాతోII

323. Na Priyuda Yesunadha Nike Stothramulu



                నా ప్రియుడా యేసునాధా - నీకే స్తోత్రములు
                నీవే నా ప్రాణం - నీవే నా జీవం - నీవే నా సర్వం
                నీవే నా ఆశ్రయము అయ్యా....

1.            ప్రధాన పాపిని పశుప్రాయుడను - నిన్ను విడచి తిరిగినాను         
               నీకు దూరమయ్యాను - ఐనా ప్రేమించావు పాపాలు క్షమించావు
               నా కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు

2.            మంచి లేదయ్య నన్ను ప్రేమించావు
               ఏమిచ్చి నీ ఋణం తీర్చనయ్యా ఏమిలేని  దరిద్రుడను
               నిరుపేదను నేను ఏమివ్వలేనయ్య

3.            బ్రతుకలేనయ్యా - నీవు లేక క్షణమైన
               బ్రతికించుము నీదు కృపతో - బలపరచుము నీ సేవలో
               నీవే దయాళుడవు - నీవే నా దేవడవు కరుణించవా నా ప్రియుడా 
               నీ కృప నిత్యముండును గాక

322. Nannu Diddumu Chinna Prayamu

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా     

దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా     

మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా       

చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా 

జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా 

కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా   

ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా     

శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా    

వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా           

321. Nannu Gannayya Rave Na Yesu Nannu Gannayya Rave Na Prabhuva

నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా        ||నన్ను||

ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ       ||నన్ను||

హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి       ||నన్ను||

కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి       ||నన్ను||

దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి       ||నన్ను||

నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి       ||నన్ను||

320. Nadipinchu Na Nava Nadi Sandramuna Deva

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడి||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడి||

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడి||

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు              ||నడి||

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట       ||నడి||

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పణగా లోకేశ చేయుమయా         ||నడి||

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు     ||నడి||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...