నాదు హృదయపు ద్వారము తెరచెదను
యేసు పాపపు రోగికి నీవె గతి IIనాదుII
యేసు చచ్చిన వారిని లేపితివే
మరి కుంటికి కాళ్ళను యిచ్చితివే
నేను పాపిని రోగిని నీవే గతి
నాకు దిక్కులేదిక వేరెక్కడ IIనాదుII
ప్రభు కుష్టును ప్రేమతో ముట్టితివి
మరి దుష్టుల చెంతకు చేరితివి
నాదు పాపపు కుష్టును పారద్రోలి
పరిశుభ్రత నియ్యుము నీవే గతి IIనాదుII
యేసు యాయీరు కుమార్తెను లేపితివి
మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ
నాకు వేరొక మార్గము లేదికను IIనాదుII
ప్రభు మార్గము ప్రక్కన కూర్చునిన
ఆ అంధుని ధ్వనిని వింటివిగా
నేను పాపిని అంధుని యేసుప్రభూ
నను దాటకు దిక్కిక లేరు ప్రభూ IIనాదుII
No comments:
Post a Comment