నీవు లేని రోజంతా రోజౌనా
నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా IIనీవుII
జీవజల ఊటయు ప్రభు నీవే
సత్యము మార్గము ప్రభు నీవే
నా తోడబుట్టువు ప్రభు నీవే
నాలోని సంతసం ప్రభు నీవే IIనీవుII
వెలుగందు జ్వాలయు ప్రభు నీవే
ధ్వనియు శబ్దము ప్రభు నీవే
తాళము రాగము ప్రభు నీవే
మ్రోగెడి కంచుయు ప్రభు నీవే IIనీవుII
నా క్రియలన్నియూ ప్రభు నీవే
నాదు బలమంతయూ ప్రభు నీవే
నా కోట బాటయు ప్రభు నీవే
నా డాలు కేడెము ప్రభు నీవే IIనీవుII
నా తలంపులన్నియు ప్రభు నీవే
నా భాష మాటయు ప్రభు నీవే
నాదు విమోచన ప్రభు నీవె
నా పునరుత్థానము ప్రభు నీవె IIనీవుII