Wednesday, 4 April 2018

473. Rammu Nedi Pendliki Deva

రమ్ము! నేడీ పెండ్లికి - దేవ!

కరుణ దయచేయు మదియాదరణ
విశ్వాసమందు - మరణ - పర్యంతము
నీ - స్మరణజేయు సాయమీయ

ఈ వ-ధూవరులను - దేవ - భక్తులజేసి
జీవ - నంబౌ గృహాన బ్రోవ జీవాధిపతి

లిలియ - పుష్పంబు వలెనె - వెలయు
గష్టాదులచే - నలయ - కుండ నిన్నెపుడు
నీలోనె కలియు - గృపాదానార్ధమై

నీతి-మార్గంబున బ్ర-ఖ్యాతి-గా బావురంబు
రీతి - నిష్కపటులై నీచేతి - నీడన్నిల్చుటకై

ఇలను - మానవాళియె - డలను
నీ హద్దులలో - పలను సకల - నీతి
వి-ధులను - నెరవేర్పించి నడుప

చేరి - యున్న యీ సభవారి
దంపతులగు - వీరి - బోధకులగు
వారి - నాశీర్వదింపను


472. Mangalame Yesunaku

మంగళమే యేసునకు - మనుజావతారునకు
శృంగార ప్రభువునకు – క్షేమాధిపతికి

పరమ పవిత్రునకు - వర దివ్య తేజునకు
నిరులమానందునకు - నిపుణ వేద్యునకు

దురిత సంహారునకు - నర సుగుణోదారునకు
కరుణా సంపన్నునకు – జ్ఞానదీప్తునకు

సత్య ప్రవర్తునకు- సద్ధర్మశీలునకు
నిత్య స్యయంజీవునకు – నిర్మలాత్మునకు

యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షామణికి
సత్య పరంజ్యోతియగు – సార్వభౌమునకు

పరమపురి వాసునకు - నరదైవరూపునకు
పరమేశ్వర తనయునకు - ప్రణుతింతుము నీకు

471. Devara Ni Divenalu

దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)
దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై       ||దేవర నీ||
ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము            ||దేవర నీ||
ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్      ||దేవర నీ||
తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును        ||దేవర నీ||
సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్          ||దేవర నీ||
మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే         ||దేవర నీ||
యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్        ||దేవర నీ||
వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్        ||దేవర నీ||

470. Kalyanam Kamaneeyam

కల్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) 
ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయ్యా        ||దేవా||
కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే
అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా      ||దేవా||
బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా          ||దేవా||

469. Yesutho Tiviganu Podama

యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదము
రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవ చేయను
యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను 
విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై
యేసుతో ఠీవిగాను వెడలను           
శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను 
ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసురాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను
సాధనంబెవరు నీవు నేనెగా   

468.Yuvathi Yuvakulam Sahasavanthulam

యువతీ యువకులం - సాహసవంతులం
యేసుక్రీస్తు సాక్షులుగా
జీవింతుము జీవింతుము జీవింతుము

దుష్టునితో ధైర్యముగ పోరాడి గెలిచెదము
యేసే మా సేనాధిపతి - యేసే మా విజయగీతి

సాతాను మోసములు - ఎరుగని వారము కాము
దహించు అగ్ని మా ప్రభువు - కాల్చి కూల్చును అపవాదిని

467. Devuni Varasulam Prema Nivasulamu

 
దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము  
సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము 
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసుని చూపుదుము
దారుణ హింస లలో – దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము 
పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదము
అనుదిన కూటములు – అందరి గృహములలో
ఆనందముతోను – ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదము
హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో
నూతన లోకము కాంక్షింతుము 
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ
విభు మహిమను గాంచ విశ్వమే మము గోర
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసును జూపుదుము

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...