నా యేసు రాజు వస్తున్నాడు
కోటాను కోటి దూతలతో
నా విమోచకుడు వస్తున్నాడు
నన్ను పాలించుట కొస్తున్నాడు IIనాII
పరమందు స్థలమేర్పరచి
పరిశుద్ధులతో వస్తున్నాడు
పరమందు నను జేర్చుటకై
ఇదిగో త్వరగా వస్తున్నాడు IIనాII
ప్రధాన దూత శబ్ధముతో
ప్రభావ ఘన మహిమలతో
పరలోకము నుండి ప్రభువు
ఇదిగో త్వరగా వస్తున్నాడు IIనాII
జయశీలుడగు ప్రభుయేసు
జీవంబు నిచ్చిన రాజు
జీతంబు నాకీయుటకు
ఇదిగో త్వరగా వస్తున్నాడు IIనాII
రాజులరాజు యేసయ్యా
రక్షించు ప్రభు యేసయ్య
రాజ్యము వెయ్యేండ్లు చేయ
ఇదిగో త్వరగా వస్తున్నాడు IIనాII