Wednesday, 4 April 2018

474. Ade Ade Aa Roju


అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు       ||అదే అదే||

వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు        ||అదే అదే||

సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు
పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు         ||అదే అదే||

వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు      
 ||అదే అదే||

  

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...