Wednesday, 4 April 2018

475. Idigo Mi Raju Ethenchuchunnadu

ఇదిగో మీ రాజు ఏతెంచుచున్నాడు 

మీ తలలెత్తుడి

సమీపమాయె మీ విడుదల

ధైర్యము నొందుడి

యుద్ధములు కలహములు వైరములు 

నిందలు హింసలు అపవాదులు

అంతము వరకు సూచనలివియే

మేల్కొని యుండుము

అక్రమము అవినీతి ప్రబలును 

అందరి ప్రేమలు చల్లారును

అంతము వరకు కాపాడుకొమ్ము

మొదటి ప్రేమను

చిగురించుచున్నది అంజూరము 

ఏతెంచియున్నది వసంతము

ఉరుమొచ్చునట్లు అందరిపైకి

అంతము వచ్చును

ఎల్లప్పుడు ప్రార్ధన చేయుచు 

మత్తును చింతను వీడుము

విశ్వాస ప్రేమ నిరీక్షణల్‌

ధరించి యుండుము

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...