About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.

Wednesday, 4 April 2018

477. Tvaraga Ranunna Yesu Tvaragane Rammu Thandri

త్వరగా రానున్న యేసు తర్వగానే రమ్ము తండ్రి
త్వరగా వచ్చు ప్రభువా చురుకు
తనమిమ్ము నే త్వరపడగలను                           || త్వరగా ||

నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు
గానన్ పరిశుద్ధాత్మయే నన్ను
కడకు సిద్ధము జేసికొనును                           || త్వరగా ||

రాకడ సామీప్యమన్న లోకము హేళనచేయు
లోకముతో నీ సంఘము కూడ
ఏకమాయెను ఏమి చేతును                         || త్వరగా ||

ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో రాజ
క్షితినిమిత్త మిదియె ప్రార్ధన
స్తుతి చేతును నీ కనుదినంబును                 || త్వరగా ||

విశ్వాసులె నేటి రాకడ విశ్వసింపరంచు జెప్పి
విశ్వాసము పోగొట్టుకొనక
విశ్వాసముచే పట్టుకొందును                     || త్వరగా ||

ప్రభువైన యేసు రమ్మను ప్రార్ధన నేర్పుమో ప్రభువా
సభలకు మాత్రమే కాక ఇతర
జనులకు కూడనిదియె ప్రార్ధన                 || త్వరగా ||

రాకడనమ్మిక అరిగి పోకముందె రమ్ము తండ్రీ
రాకడకు సిద్ధము గాకున్న
లోకము హేళన చేయక మానదు              || త్వరగా ||

జనక సుతాత్మలకు స్తుతులు సంఘ వధువు వల్ల భువిని
మనుసున స్తుతికార్యము తప్ప మరి
పనియేమున్నది భక్త జనాళికి                 || త్వరగా ||

No comments:

Post a Comment

Netho Unte Jeevitham | Telugu Christian Song # 595

నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...