Wednesday, 4 April 2018

492. Oka Divyamaina Sanghathitho Na Hrudayamu Uppongenu


ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని                        ||ఒక దివ్యమైన||

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2)                 ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2)        ||ఒక దివ్యమైన ||

491. Uhalakandani Lokamulo Unnatha Simhasanamandu


ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనమందు

ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా

సెరూపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని

స్వరమెత్తి పరమందు పాటలు పాడిన పావనుడా

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా

నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

అల్ఫయును ఓమెగయును అన్ని కాలంబుల నున్నవాడా

సర్వాధికారుండా సర్వేశా సజీవుండా

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

490. Paralokamu Na Desamu Paradesi Nenila Mayalokamega Nenu Yathrikudanu

పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను
ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును 
దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము 
రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ 
అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరున్ 
నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి

489. Paradesulamo Priyulara Mana Puramidi Gadepudu

పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) 
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) 
సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) 
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) 
మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) 
ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ)
ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) 
వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా)
ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) 
యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) 
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) 

488. Vadhuvu Sanghamu Varuni Koraku Eduru Chuchuchunnadi

వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది
అధమమొక్క పాపమైన - అంటకుండ నున్నది
అంటనీయకున్నది అంటు అంటనుచున్నది

వరుని ప్రేమ స్మరణతోనే - పరిపూర్ణమౌచున్నది
వరుని మీదనున్న ప్రేమ-పెరగనిచ్చుచున్నది
తరగనీయకున్నది-వరుడు వరుడను చున్నది

'త్వరగ' ననగా గురుతులైన - తరువాత అనుచున్నది
గురుతులు జరిగిన దొంతి - గురుతు పెట్టుచున్నది
వరుని గురుతున నున్నది - గురుతు గురుతనుచున్నది

'త్వరగనన్నది' నరునియాత్మకు - ప్రవచనమనుచున్నది
ఇరువదివందల యేండ్లయినను - 'త్వరగ'నే యనుచున్నది
వధువు సిద్ధమనచున్నది - వధువు వధువనుచున్నది

గురుతులను ప్రవచనములను - గణియించుచున్నది
సరిగనున్నవి రెండుననుచు - మురియుచునే యున్నది
తరచు తరచు చున్నది - సరియె సరియనుచున్నది

ఆడితప్పనివాడు రాక - అట్టేయుండడనుచున్నది
నేడు వచ్చి వేసినట్టే - పాడుకొనుచున్నది
కీడు చూడకున్నది నేడు నేడనుచున్నది

వరుడు వధువు నొక్కటే గనుక త్వరగా నిజమనుచున్నది
'త్వరగ'లో ఇద్దరు దంపతులుగా బరుగు చుండ్రనుచున్నది
నిరుకు బ్రతుకనుచున్నది - నిరుకు నిరుకనుచున్నది

'త్వరగ' కడ్డులు లేవను నర్ధము విరివిగా చెప్పుచున్నది
నరులు నపవాదియు నడ్డు పరుపలేరనుచున్నది
వరుడడిగో యనుచున్నది పాపహరుడనుచున్నది

తేదిరాక కున్నదన్న లేదు లేదనుచున్నది తేది అపుడు
తెలియు నన్న - తెలియనగు ననుచున్నది కాదు
ఇపుడనుచున్నది తేది తేదియనుచున్నది

చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదె యనుచున్నది
ఆయత్తమౌనాటికి తేది - అందుననుచున్నది
మాయలేదనుచున్నది హాయి హయి యనుచున్నది

ఇక్కడను పైనక్కడను - ఒక్క కుటుంబమే యగును
లెక్కకు రెండగును మరిమొక - లెక్కకు నొక్కియే యగును
ఒక్కియే మందయగును - ఒకియే సంఘమగును

487. Loyalella Pudchabadali Kondalu Konalu Kadalipovali

లోయలెల్ల పూడ్చబడాలి
కొండలు కోనలు కదలిపోవాలి
వక్రమార్గము సక్రమవ్వాలి
కరకు మార్గం నునుపవ్వాలి ||2||
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

ఫలం ఇవ్వని చెట్టులెల్ల
నరకబడి - అగ్నిలో వేయబడును
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

గోధుమలను వేర్పరచి గింజలను చేర్చి
పొట్టును నిప్పులో కాల్చి వేయును
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

పరిశుద్ధులుగా కక్ష్యలు లేక
ప్రభుకై జీవించి సాగిపోదాం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం  
అభిషేక తైలముతో నింపబడెదం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం (2)
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం

486. Rajadhi Raju Devadi Devudu

రాజాధి రాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను
మనయేసు రాజు వచ్చును
పరిశుద్ధులన్‌ చేయ మనలన్‌
ఆ... హా మన మచట కేగుదాం         ||3||

ముద్రపొందిన శుద్ధులందరు
తెల్లంగి ధరించెదరు
జయజెండాలు పట్టుకొందురు
విమోచన్‌ గీతము పాడెదరు
ఆహా ఎంతో ఆనందమది              ||3||

నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు
పరలోక పాలనది
దుఃఖం వ్యాది లచట లేవు
ఆకలి దప్పిక లచ్చట లేవు
ఒకే హల్లేలూయా ధ్వనియే         ||3||

అందరు కలసి విందులో చేరి
ఆనందముగ నుందురు
మధ్యాకాశములో విందు
విమర్శింప బడెదరు
పరిశుద్ధులు పాల్గొందురు        ||3||

పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు
సమయంబు ఇదియేను
నీతిమంతుడు నీతి చేయును
ఫలముతోనే వచ్చెదను
ఆమేన్‌ యేసుప్రభూ రమ్మయా ||3||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...