Wednesday, 4 April 2018

486. Rajadhi Raju Devadi Devudu

రాజాధి రాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను
మనయేసు రాజు వచ్చును
పరిశుద్ధులన్‌ చేయ మనలన్‌
ఆ... హా మన మచట కేగుదాం         ||3||

ముద్రపొందిన శుద్ధులందరు
తెల్లంగి ధరించెదరు
జయజెండాలు పట్టుకొందురు
విమోచన్‌ గీతము పాడెదరు
ఆహా ఎంతో ఆనందమది              ||3||

నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు
పరలోక పాలనది
దుఃఖం వ్యాది లచట లేవు
ఆకలి దప్పిక లచ్చట లేవు
ఒకే హల్లేలూయా ధ్వనియే         ||3||

అందరు కలసి విందులో చేరి
ఆనందముగ నుందురు
మధ్యాకాశములో విందు
విమర్శింప బడెదరు
పరిశుద్ధులు పాల్గొందురు        ||3||

పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు
సమయంబు ఇదియేను
నీతిమంతుడు నీతి చేయును
ఫలముతోనే వచ్చెదను
ఆమేన్‌ యేసుప్రభూ రమ్మయా ||3||

4 comments:

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.