Wednesday 7 September 2016

256. Rajulaku Rajaina Ee Mana Vibhuni

రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి
యీ జయశాలి కన్న మనకింక రాజెవ్వరును లేరని

కరుణ గల సోదరుండై యీయన ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు బరలోక రాజ్యమ్మును

నక్కలకు బొరియలుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను

అపహాసములు సేయుచు నాయన యాననముపై నుమియుచు
గృపమాలిన సైనికు లందరును నెపము లెంచుచు గొట్టిరి

కరమునందొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్‌
ధరణీపతి శ్రేషుడ నీకిపుడు దండమనుచును మ్రొక్కిరి

ఇట్టి శ్రమలను బొందిన రక్షకుని బట్టుదలతో నమ్మిన
అట్టహాసము తోడను బరలోక పట్టణంబున జేర్చును

శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
భక్తితో ప్రార్ధించిన మన కొసగు రక్తితో నా ముక్తిని

త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు
దరికి జేరిన వారిని మన ప్రభువు దరుమడెన్నడు దూరము

16 comments:

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...