Saturday, 22 October 2016

270. Veerude Lechenu Maranapu Mullunu Virachi

వీరుడే లేచెను మరణపు ముల్లును విరచి
సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అణిచి
మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయవెళ్లెనే.....
ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లే ప్రకటించేసేయ్ప్రభుని మహిమెంతో చూపించేసేయ్‌.
వెలుగల్లే వ్యాపింపచేసేయ్జనుల హృదయల్ని మండించేసెయ్
అరె నమ్మిన వారినే సూచక క్రియలు వెంబండించు నెల్లప్పుడు

1. శృంగారం అనే ద్వారము వద్దన కుంటివాడు ఉండెనుగా.....
   దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా....
   వెండి బంగారము మాయొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తాం చూడని
   యేసునామంలో లేచినువు నడువని పేతురు లేపెనుగా చేపట్టి అతనిని
   గుమిగూడిన ప్రజలంతా విస్మయమొందగా
   శుద్ధాత్మ అభిషేకం బలము నివ్వగా
   మమ్మెందుకు చూస్తారు ప్రభువే మాకు చేశాడు అని పేతురు సాక్ష్యమిచ్చెగా
   హే హే వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదిని వాక్కు పొడువగా      ||అరె||

2. లుస్త్ర అనెడి యా పట్టణమందున కుింవాడు నడిచెనుగా
   పౌలు బర్నబా ఆత్మపూర్ణులై అద్భుతక్రియలెన్నో చేస్తుండెనుగా
   దేవతలే మనుషులుగా వచ్చారు అనుకొని అన్యులు పునారెే బలి అర్పించాలని
   అయ్యో జనులారా ఇది ఏమి పనిఅని మేము మీలాంటి మనుషులమే నంటాని
   ఈ వ్యర్ధ దేవతలను విడచిపెట్టండని జీవముగల ప్రభువైపుకు తిరగండని
   అంతటను అందరును మారుమనస్సు పొందాలని ప్రభువు ఆజ్ఞాపించెననెను
   హే హే భూలోకమంతటిని తలక్రిందులు చేసుకుంటూ దేశాల్ని కుదిపేసెగా        ||అరె||

 3. దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా
   విడుదలకోసమై మూలుగుచుండెనె రక్షకుడేసయ్యే విడిపించునుగా
   దేవపుత్రుడా ఇక ఆలస్యమెందుకు యూదా సింహంలా దూకేయ్నువు ముందుకు
   యేసునామంలో అధికారం వాడవోయ్యేసురక్తంలో శక్తేoటో చూపవోయ్
   దెయ్యాలని తరిమేసెయ్రోగులను బాగుచెయ్
   ప్రభువు వలె జీవించి వెలుగుపంచవోయ్లోకాన జనమంతా సాతాను
   ముసుగులోన గ్రుడ్డివారై త్రూలుచుండెనే
   ఆహ సువార్త ప్రకాశమై కన్నులను తెరుచునింక వినిపించెయ్సిలువ వార్తను ||అరె||

2 comments:

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...