About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.

Friday, 30 August 2019

517. Aradhana Stuthi Aradhana Nivanti Varu Okkarunu Leru

ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని         ||ఆరా||
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరా||
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే 
నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరా||

Thursday, 29 August 2019

516. Aa Bhojana Pankthilo

ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో 
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను 
కన్నీటితో  పాదాలను కడిగింది
తనకురులతో పాదాలు తుడిచింది ఆమె
సువాసన సువాసన ఇల్లంతా సువాసన
ఆరాధన దైవారాధన ఆత్మీయఆలపన

జుంటి తేనె దరాలకన్న మధురమైన నీ వాక్యం
ఆవాక్యమే నన్ను బ్రతికించెను
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధన ఆత్మీయ ఆలపన ||2||(ఆభోజన)

సింహపు నోళ్ళను మూయించినది నీ వాక్యం
దానియేలుకువిజయము నిచెను ఆపై నీ వాక్యం
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
రాధనదైవారాధన ఆత్మీయ ఆలపన||2||(ఆభోజన)

అహష్వరోషు మనసును మార్చినది నీ వాక్యం
ఎస్తేరుప్రార్థన కు విడుదల నిచ్చిన నీ వాక్యం
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన||2||   ( ఆభోజన)

Thursday, 22 August 2019

515. Neeve Neeve Na Sarvam Neeve

నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
నీవే నీవే నా జీవం నీవే సహాయము నీవే
నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నా (2)
ఎదురు చూస్తున్నా యేసయ్యా
ఎదురు చూస్తున్నా
                                                        
అనుక్షణము నిను చూడనిదే
క్షణమైనా వెడలనులే
హృదయములో నీ కోసమే
నిను గూర్చిన ధ్యానమే
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే

ఒంటరి నైనా నీ స్పర్శ లేనిదే
బ్రతుకే లేదని
అనుదినము నీ ఆత్మలో
నిను చూసే ఆనందమే
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే


Tuesday, 13 August 2019

514. Edabayani Nee Krupa Nanu Viduvadu Ennatiki

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ  } 2
యేసయ్య నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం  } 2   || ఎడ ||

శోకపు లోయలలో   కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో  నిరాశ నిసృహలో } 2
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ } 2
కృపా కనికరం గల దేవా 
నా కష్టాల కడలిని దాటించితివి } 2 || ఎడ ||

విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } 2
దుష్టుల క్షేమమునేచూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } 2
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి } 2 || ఎడ ||

నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } 2
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ } 2
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి } 2 || ఎడ ||

Thursday, 8 August 2019

513. Prardhana Shakthi Naku Kavalaya

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)       || ప్రార్థన ||

Friday, 2 August 2019

512. Na Thoduga Unnavadave

నాతోడుగా ఉన్నవాడవే..! 
నాచేయి పట్టి నడుపు వాడవే...!
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా 2 ||నాతోడు||

నా అనువారు నాకు దూరమైనా
నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ..ఆ..ఆ.. 2
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే 2 ||నాతోడు||
నాపాదములు జారిన వేళ 
నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ..ఆ..ఆ.. 2
నీ కుడి చేతితో నన్నుహత్తుకొంటివే 2||నాతోడు||
హృదయము పగిలి వేదనలోన 
కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ..ఆ..ఆ..2
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే.....2  ||నాతోడు||

511. Yehova Chetha Aasirvadincha badinavada


యెహోవాచేత ఆశీర్వదించ
బడినవాడా లోపలికిరావా
దేవుని రక్షణ ఓడ లోపల రక్షింపబడే నోవహు
దేవుని మాట వినక వెలుపల ఆ ఆ
వెలుపల నున్న ప్రజలు
తినుచు త్రాగుచు పాపములోపడి
నశియించిరి జల ప్రళయములో
పెండ్లి విందుకు రాజు పిలువగా
సాకులు చెప్పిరి కొందరు
లోపలనున్నవారు విందులో పాల్గొన్నారు
పెండ్లి వస్త్రము లేని ఒకనిని
త్రోసిరి వెలుపల చీకటిలో
గవినివెలుపల సిలువలో యేసు
మనలను బ్రతికింప మరణించే
లోపల నిత్యజీవము
వెలుపల నిత్యనరకం ... ....
యేసుని నమ్మి రక్షణ పొంది
జీవములో చేర రమ్ము  ప్రియుడా

Netho Unte Jeevitham | Telugu Christian Song # 595

నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...