నీవే నీవే నా సర్వం నీవే
సమస్తము నీవే
నీవే నీవే నా జీవం నీవే
సహాయము నీవే
నీ స్నేహము కోరి ఎదురు
చూస్తున్నా (2)
ఎదురు చూస్తున్నా యేసయ్యా
ఎదురు చూస్తున్నా
అనుక్షణము నిను చూడనిదే
క్షణమైనా వెడలనులే
హృదయములో నీ కోసమే
నిను గూర్చిన ధ్యానమే
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే
ఒంటరి నైనా నీ స్పర్శ
లేనిదే
బ్రతుకే లేదని
అనుదినము నీ ఆత్మలో
నిను చూసే ఆనందమే
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే
నీ రూపం కోరెనే
No comments:
Post a Comment