నీవే
కృపాధారముత్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా /2/
నూతన బలమును నవ నూతన కృపను /2/
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా .. /నీవే/
ఆనందించితిని
అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను /2/
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి /2/
ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా /2/నీవే/
సర్వకృపానిధి
– సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి /2/
సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి /2/
శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా /నీవే/
ప్రాకారములను
దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి /2/
పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి /2/
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకెనయా /నీవే/
Your Affiliate Money Printing Machine is ready -
ReplyDeleteAnd getting it set up is as simple as 1, 2, 3!
Here's how it works...
STEP 1. Choose affiliate products you want to push
STEP 2. Add some push button traffic (this ONLY takes 2 minutes)
STEP 3. See how the affiliate system explode your list and sell your affiliate products all by itself!
Are you ready?
The solution is right here