Saturday, 20 August 2016

208. Devuni Sannidhi Niluvuma Sada

దేవుని సన్నిధి నిలువుమా సదా
యేసు స్వామి సేవచేయ సాగు నిరతము
స్వామి యేసు సేవచేయ సాగు నిరతము       || దేవుని ||

యవ్వన కాలమందున గుర్తించు క్రీస్తునే
సర్వ వేళలందున స్తోత్రంబు ప్రభునకే
అవనిలోన నడువుమా అవనిలోన నడువుమా
వెలుగు బాటలో - వెలుగు బాటలో               || దేవుని ||

శోధనల్ కల్పించును సాతానుడెన్నియో
బాధలు తొలగించును ప్రభు క్రీస్తు రాజుడే
పుడిమిలోన నిలువుమా పుడమిలోన నిలువుమా
క్రీస్తు ధ్వజములో - క్రీస్తు ధ్వజములో          || దేవుని ||

207. Cheyali Cheyali Daiva Sannidhi Cheyali

చేయాలి చేయాలి దైవసన్నిధి చేయాలి
సన్నిధి చేస్తే సమస్తమైన మేళ్ళు కలుగున
దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును

సన్నిధి గదిలో చక్కగ నీవు మోకరించాలి
మోకరించి నీవు దైవశక్తిని అందుకోవాలి

గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసెను
ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను

పెండ్లి కుమార్తెలు మేమమ్మయని సవాలు చేస్తార
ుసన్నిధి కాస్తా చేయకపోతే చతికిల పడతారు

రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి
ఆ సన్నిధిలోనే రేప్చెర్ మహిమ అనుభవించాలి

సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగున
ఆ సన్నిధి పరులే సాతాను శిరము చితుక త్రొక్కదరు

బైబిలు మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది
ఆ సన్నిధి పరులే బైబిలు మిషనుకు మెంబర్లు అవుతారు

206. Kurchundunu Nee Sannidhilo Deva Prathidinam

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను  ||కూర్చుందును||

ప్రతి విషయం నీకర్పించెద
నీ చిత్తముకై నే వేచెద (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెద (2)
నీ నామమునే హెచ్చించెద (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||

ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెద (2)
నీ వాక్యానుసారము జీవించెద (2)
నీ ఘన కీర్తిని వివరించెద (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును|

205. Israyelu Sainyamunaku Mundu Nadachina Daivama

ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2)
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2)

సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2)
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2)

పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2)
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి (2)

నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2)
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2)

ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (2)
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2)   

204. Sathyaveda Grandhamu aa aa Chaduva Chakkani


సత్యవేద గ్రంధము ఆ.ఆ చదువ చక్కని గ్రంధము
దీన్ని చదువువారే ధన్యులు

1. దేవ వాక్కుల గ్రంధము ఆ.ఆ దీన జనుల గ్రంధము
దీన్ని గైకొనువారే ధన్యులు

2. వాగ్ధానముల గ్రంధము ఆ.ఆ వరదానముల గ్రంధము
దీన్ని నమ్మువారే ధన్యులు

3. జీవాహార గ్రంధము ఆ.ఆ జీవజలముల గ్రంధము
నిత్య జీవమున్నది దీనిలో

4. రెండంచుల ఖడ్గమై ఆ.ఆ ఖండించు జీవవాక్యమై
సజీవవాక్య గ్రంధము

5. సర్వలోక గ్రంధము ఆ. ఆ సాటిలేని గ్రంధము
పరిశుద్ధ గ్రంధమిదియే

203. Yesayya Ni Noti Mata Kaliginche Nalo Jivapu Oota

యేసయ్యా నీ నోటి మాట
కలిగించె నాలో జీవపు ఊట
నడిపించె నన్ను నీ వెలుగుబాట
నీ కొరకే ఈ నా క్రొత్తపాట
ఈ క్రొత్తపాట

పరము నుండి పరికించినావు
పాపము నుండి విడిపించినావు
నీ రక్షణనే ప్రకించెదన్... ||2||
నా నిరీక్షణ ప్రచురించెదన్ ||2||

నా గానము నీవే నా దేవా
నా గీతము నీకే నా ప్రభువా..
నా దైవము నీవే నీవే యేసయ్యా ||2||
నా జీవము నీకే నా మెస్సయ్యా ||2||

202. Bailu Parachinavu Nee Bibulu

బైలు పరచినావు - నీ - బైబిలు గ్రంథంంబు
బైలుపరచినందున - ప్రభువ వందనంబు

బైలు పరచినావు - ఒక - వ్యక్తికే మొదట
బైలు పరచినావు - ఆ - కాల సభకు పిమ్మట

బైలు పరచినావు - వి - శ్వాస కూటములకు
బైలు పరచినావు - విశ్వాస శాన్య జనులకు

బైలు పరచినావు - ప్రపంచదేశములకు
బైలు పరచినావు - పదివందల బాషలకు

బైలు పరచినావు - నీ - వాసులమౌ మాకు
బైలు పరచినావు - రెండు - వేల కాల జనులకు

అచ్చు పుట్టినప్పుడే - అది - అచ్చు వేయించినావు
నచ్చినట్టి వారిలో - అది - గ్రుచ్చి వేసినావు

బైలు పరుపగలవు - రా - వలసిన జనములకు
బైలు పరుపగలవు - యుగ - కాలముల వరకు

జనక సుతాత్మకలకు - మా - వినయ వందనములు
అనయు సత్కీర్తియు - ఘనతయు స్తోత్రములు

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...