దేవుని సన్నిధి నిలువుమా సదా
యేసు స్వామి సేవచేయ సాగు నిరతము
స్వామి యేసు సేవచేయ సాగు నిరతము || దేవుని ||
యవ్వన కాలమందున గుర్తించు క్రీస్తునే
సర్వ వేళలందున స్తోత్రంబు ప్రభునకే
అవనిలోన నడువుమా అవనిలోన నడువుమా
వెలుగు బాటలో - వెలుగు బాటలో || దేవుని ||
శోధనల్ కల్పించును సాతానుడెన్నియో
బాధలు తొలగించును ప్రభు క్రీస్తు రాజుడే
పుడిమిలోన నిలువుమా పుడమిలోన నిలువుమా
క్రీస్తు ధ్వజములో - క్రీస్తు ధ్వజములో || దేవుని ||
No comments:
Post a Comment