కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
ప్రతి విషయం నీకర్పించెద
నీ చిత్తముకై నే వేచెద (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెద (2)
నీ నామమునే హెచ్చించెద (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెద (2)
నీ వాక్యానుసారము జీవించెద (2)
నీ ఘన కీర్తిని వివరించెద (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|
No comments:
Post a Comment