నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||నీవుంటే||
ఎన్ని బాధలు ఉన్ననూ ఇబ్బందులైననూ
ఎన్ని శ్రమలు ఉన్ననూ నిష్టూరమైననూ ||నీ మాట||
బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా||నీ మాట||
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ||నీ మాట||
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు కాదిల సమానము||నీ మాట||