దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను – సౌఖ్యం సంభ్రమాయెను ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు అంత్య కాలమందున – కన్య గర్భమందున బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
రావే నీతి సూర్యుడా – రావే దేవ పుత్రుడా నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి