Wednesday, 24 August 2016

228. Deva Stothraganamul pai (Christmas Song)

దేవస్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో
దేవమారుగానముల్ భూ - దేశ స్థలములో
దేవలోక పావనులును - దీన నరులును బోవజూడ
భువిదివి క్రిస్మస్

అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో
పవ్వళించి యున్నదేవ - బాల యేసులో
ఇవ్విధముగ సఫలమాయె - ఈ దినంబున
నవ్వు మోము - నరుని కబ్బెను

షేము దేవ వందనంబు - చెప్పబడియెను
భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు
భూమి పైన నరుడుగాను = బుట్టవచ్చెను
భూమి క్రిస్మస్ - భోగమొందెను

అందరి వంశంబులు నీ - యందు దీవెన
బొందునంచు నబ్రామునకు - నందెను వాక్కు
అందె క్రీస్తు – యూదులకును అన్యజనులకున్
విందు క్రిస్మస్ - విశ్వమంతటన్

షీలోహువచ్చు వరకు యూ - దాలో నిలుచుచు
నేలు రాజదండముండు నెపుడు తొలగదు
నేల మీద నిత్యశాంతి పాలన జేయ - పాలకుండౌ
బాలుడు జన్మించెన్

అక్షయమగు చుక్క యొకటి - యాకోబులో
లక్షణముగ బుట్ట - వలయును ధాత్రి పై
రక్షణార్ధులే స దాని - రీక్షించెడు నక్షత్రంబగు
రక్షకుడుదయించె

పుట్టవలయు మోషే వంటి - పూర్ణ ప్రవక్త
ఎట్టి వారలైన నెరుగ - నట్టి ధర్మముల్
దిట్టముగను స్థాపింప - దేవ పుత్రుడు - పుట్టెన్
గొప్ప - బోధకుడయెను

మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్
నరులకు దేవుండె తోడు - నిరతము వరకున్
దరిని దేవుడుండు గాన – వెరువ మెన్నడున్
పరమ దేవుని సహ - వాసము లభించెన్

మన నిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను
చనువుగ దరిజేర శిశువు -స్వామి యాయెను
తనువు రక్షణను గణింప – వెనుక దీయడు
వియన భూషణులకు - వేళ వచ్చెను

మొలకలెత్త వలె యెష్షయి - మొద్దునందున
ఫలము లేని మోడు నరుల - వంశవృక్షము
విలువ గలుగు నిత్యజీవ – ఫలవమె లిడుటకై
కళగల జన్మార్ధ - కరుడు వచ్చెను

ఖలలు చీకటిన్ నడుచుచు - వెలుగు చూచిరి
పలు విధంబులైన యట్టి - పాప చీకటుల్
తొలగజేసి శుద్ధ కాంతి - కలుగ చేయను
వెలుగుగా దేవుడు వెలసె - ధాత్రిలో

అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు
నిల్పవలెను తనదు జన్మ - నిజ చరిత్రను
అల్పులందు సైతమల్ప - మైన యూళ్ళలో
సల్ప రక్ష - స్థాపకుడై వచ్చె

ఆడి తప్పనట్టి దేవ - అనంత స్తోత్రముల్
నాడు పల్కు వాగ్ధా -నముల నన్నిన్
నేు నెరవేర్చినావు - నీ సుతునంపి – కీడుల్
బాపు - క్రిస్మసు గల్గె

నీ నిజ వాగ్ధత్తములను - నిత్యము నమ్మి
వాని నెరవేర్పులు విని - వట్టివి యనక
మానసమున ననుభవించు – మనసునీయుమని
దానామూల్య - జ్ఞాన మొసగుమీ

గగన మందు క్రిస్మసుండు - గాన కీర్తుల
జగతి యందు క్రిస్మసుండు - స్థవము గల్గుత
యుగయుగముల వరకు త్త్రైకు -డొందు ప్రణుతులు
సొగసుగ బరగెడు - చోద్య గీతముల్

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...