Tuesday, 23 August 2016

223. Digivachina Devun Suthudevaro

దిగివచ్చిన దేవుని సుతుడెవరో
లోకానికి రక్షకుడతడెవరో
మాకాయన జాడలు కావాలి
ఆ యేసుని చూడలి                     ||దిగి||

చనిపోయిన వారిని లేపెనట
పలు సూచక క్రియలను చేసెనట
మేమాయన సన్నిధి చేరాలి
ఆ యేసుని చూడలి                      ||దిగి||

పడిపోయిన వారిని లేపుటకే
గతి తప్పిన వారిని వెదకుటకే
విధి మానవుడై జన్మించెనట
ఆ యేసుని చూడలి                      ||దిగి||

తన బ్రతుకే మనిషికి మార్గమట
తన మాటే బ్రతుకుకు బాటయట
ఆ కారణ జన్ముని కలవాలి
ఆ యేసుని చూడలి                      ||దిగి||

ప్రతి గుండెకు ఆయన దీపమట
పరదైసుకు ఆయన ద్వారమట
ఆ స్వామిని గని తరియించాలి
ఆ యేసుని చూడలి                     ||దిగి||

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...