Tuesday, 27 February 2018

389. Evaru Nannu Cheyi Vidachinan

ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)నిన్ను చేయి విడువడు
తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)          ||ఎవరు||
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)          ||ఎవరు||
రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)   ||ఎవరు||
ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)    ||ఎవరు||

388. Entha Manchi Devudavayya Entha Manchi Devudavesayya

ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)   ||ఎంత||
ఘోరపాపినైన నేను – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)       ||ఎంత||
నాకున్న వారందరూ – నను విడచిపోయినను (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను
నను నీవు విడువలేదయ్యా (2)    ||ఎంత||
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)       ||ఎంత||

387. Entha Manchi Devudavayya Yesayya

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)
సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)           ||ఎంత మంచి||
ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)          ||ఎంత మంచి||
సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)         ||ఎంత మంచి||

386. Anandam Mahanandam Na Priyuni Swaram Madhuram

ఆనందం మహానందం - నా ప్రియుని స్వరం మధురం

ముఖము మనోహారం - ప్రియుని ముఖము మనోహారం

నశియించిన పాపిని నేను - శాశ్వతమైన కృపజూపి

నా యేసుడెగా రక్షించెనుగా - నా ప్రభువును సేవింతునుగా

వేడుకతో విందుశాలకు నన్‌ - తోడుకు వెళ్ళును నా ప్రియుడు

కోరిన ఫలములు తినిపించును - కూరిమితో నా ప్రియ ప్రభువు

ఆనందభరితనై నేను - అతని నీడను కూర్చుందున

వాడబారను యేనాికి - వరదుని బాడుచు నుండెదను

ఎంతో ప్రేమతో ప్రేమించి - వింతగను నను ప్రభు దీవించె

అంతము వరకు యేసుని చెంతనే - నుందును ఆనందముతోను

రాజగు యేసు వచ్చునుగా - రాజ్యము నాకు తెచ్చునుగా

రాజ్యమునందు నే రాణిగాను - రమ్యముగ నేనుందునుగా

385. Ananda Yathra Idi Athmiya Yathra

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర        
యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2) 
రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2)  
కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) 
ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం (2)
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం    (2)

384. Andaru Nannu Vidachina

అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||

383. Yesu Goriya Pillanu Nenu

యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) 
 ||యేసు ||
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2)   ||యేసు ||
నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2)          ||యేసు||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...