Tuesday, 27 March 2018

415. Yesayya Ninnu Chudalanai Asa

యేసయ్యా.. నిన్ను చూడాలనీ ఆశ
మెస్సయ్యా.. నిన్ను చేరాలనీ ఆశ
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నాతోడు రారు ఈ లోకంలో
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా

అందరు ఉన్నారనీ.. అందరు నా వారనీ
తలచితినీ భ్రమసితినీ
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా

అంధకారంలో.. అంధుడ నేనైతినీ
నినుచూసే నేత్రములు
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా నా భాష నీవయ్యా

414. Yesanna Swaramanna Nivepudaina Vinnava

యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా

జలముల శబ్ధము జనముల శబ్ధము
బలమైన ఉరుములతో 
కలిసిన స్వరము పిలిచిన యేసు
పిలిచిన పిలుపును నీ వింటివా

ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే
ఆదాము ఎదుటకు అరుగక దాగిన
అటులనే నీవును దాగెదవా

పనులన్ని వదలి జనులను విడచి నను కనుగొనుమనగా
కనిపెట్టినందున ఘనడబ్రహాముకు
కనిపించె మన కన్న తండ్రి యేసే

ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరమూ
ఈనాడు నీవు ఆ స్వరము వినగా
కానాను చేరగ కదలి రావా

ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాదమరసే
ధారాళముగను పరమ వరుని
దరిచేరికొని నీవు సేవించుమా

సౌలా సౌలా నన్నేల హింసింతువు
చాలించుమనే స్వరమూ
సౌలాధికునినంత సంధించగానే
సద్భక్తుడై పౌలుగా మారెను

స్వరమును వినగా పరమార్ధజ్ఞాని స్థిరుడైన యోహాను
పరమ మర్మములు భవిష్యద్విషయాలు
ప్రకించె ప్రతిరోజు స్మరియించుమా

413. Yehova Na Manchi Kapari

యెహోవా నా మంచి కాపరి
యెహోవా నా మంచి కాపరి (గొప్ప కాపరి)
నేనాయన గొఱ్ఱెను .. ||2||
నాకు లేమి కలుగదు - నేనాయన గొఱ్ఱెను
మంచి కాపరి నా కాపరి - గొప్ప కాపరి నా కాపరి

పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును
శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును
నా ఆకలి తీరెను నా దాహము తీర్చెను

గాఢాంధకార లోయలలో నే సంచరించినను
నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును
నా భయము పోయెనే నా భారము తీరెనే

412. Yerushalemulo Gorrela Dwaramu Daggara

యెరుషాలేములో గొర్రెల ద్వారము
దగ్గర బేతెస్థ కోనేరు కలదు
అందు మంటపము లయిదు చుట్టుగలవు
కుంటి వారు గ్రుడ్డివారు ఊచకాలు చేతులు గలవారు
గుంపులు గుంపులుగా అందు పడియుండిరి

దేవదూత దిగువేళ నీళ్ళు కదలును
ఆ నీళ్ళు కదులువేళ రోగి బాగుపడును
ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడును

ముప్పది ఎనిమిది ఏండ్లనుండి రోగి ఒక్కడు
స్వస్థత నొందలేక పడియుండెనక్కడ
యేసువచ్చి వానిని చూచి స్వస్థపరచెను

యేసులేక లోకమందు మేలువుండదు
ఏ మేలు ఉన్న యేసులేక శాంతియుండదు
యేసు వుంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది

Friday, 9 March 2018

411. Mithruda Rarammu

మిత్రుడా రారమ్ము - మైత్రితో పార -
మార్థికమైన - మాటల్ వచింతు -
మన్ననతో విను

పూర్వ జన్మము నందు - పూర్తిగా పాపిని
అందుకె ఈ బాధ - పొందుచునున్నాను
అని యిట్లు మనస్సులో - అనుకొననే వద్దు
అది నిజమే యైన - అది కూడ పోగొట్టు
రక్షకుడున్నాడు - తత్క్షణమె రమ్ము
ఆయన మానవుడై నట్టి దేవుండు
ఈ మాట నమ్మిన - ఎంత ధన్యుండవు
మనస్సులో ముద్రించు - కొని శాంతి పొందుము

ఈ జన్మమున గూడ - ఎన్నెన్నో పాపాలు
చేసియున్నందున - చివరకు నరకంబె
అని ఆత్మయందున - ఆలోచనెందుకు
అవి సిల్వపై యేసు - అంతరింప జేసె
ఆ వృత్తాంతంబును - ఆనందమున
నమ్మి సుఖముగ నుండుము
సూక్ష్మ మార్గంబిది ఎందరెన్నియన్న
ఏ మాటల్ వినవద్దు దేవ వాక్కె
నిజము - దిక్కులు చూడకు

తల్లిదండ్రుల్ చేసిన - తగని కార్యంబులు
నా మీదికె పొర్లి - నను జంపు చున్నవి
ఆ శాపమును నేను - అడ్డగింపలేను
అని పల్కుచును నీవు - అదరిపోకూడదు
పాపమని తెలియని - పాపాలు ఎన్నెన్నో
చేయ బట్టి యిన్ని - చిక్కులు నను జుట్టె
అని లేనిపోనట్టి - వనుకొనకుండుము
నీ పాపముల కంటె - నీ తండ్రి దయ గొప్ప

నీ పాప శాపాలు - నీ సర్వ వ్యాధులు
మోసికొన్నట్టి శ్రీ - యేసు దేవుడు ముందె
నీ కీడు పోగొట్టి - నీ కెన్నియో మేళ్ళు
సంపాదనము చేసె సర్వోపకారుండు
దేవుండు మానవుండు దివిలోన భువిలోన
నిను బట్టి పాపివి - నిను జూడనే వద్దు
ప్రభు యేసుని బట్టి - పరిశుద్ధుడవు నీవు
ఆయనను జూచిన అంతయు సరియౌను

ఇంటిలోని పోరు - ఇంకిపోవును గాక
వాదాలు బేదాలు వాడిపోవును గాక
కలహాలు నీటను కలిసిపోవును గాక
యుద్ధాలు క్రమముగ - ఉడిగి పోవును గాక
అన్ని పాపాలును అంతరించును గాక
సర్వ దేశములందు - శాంతి కలుగును గాక
నాగరికత ప్రతి - నరుని కబ్బును గాక
దేవుని మ్రొక్కుట తేజరిల్లును గాక
ఆయన బోధలే అలుము కొనును గాక
ప్రజలందరికి దైవ - భక్తి పెరుగును గాక
మంచి జీవిని - కనికరించు చుందురు గాక
పాడి పంటలు ప్రతి - వాని కుండును గాక
వెలుగు, నీరు, గాలి - కలుగ జేసిన తండ్రి
మన యందరి వలన ఘనత నొందును గాక

దివ్య దేవుడు నిన్ను - దీవించును గాక
భూమి చేసిన వాడు - పోషించును గాక
రక్షకుండౌ క్రీస్తు - రక్షించును గాక
పరమ వైద్యుడు స్వస్థ - పరచు చుండును గాక
పనులన్నిని సఫల - పరచు చుండును గాక
దైవాత్మ ధైర్యంబు - తెచ్చు చుండును గాక
అంతాన మోక్షంబు - అందజేయును గాక
విజయము ఈ పాట - విను వారి కామెన్

410. Matlade Devudavu Nivu

మ్లాడే దేవుడవు నీవు
మ్లాడని రాయివి చెట్టువు నీవు కాదు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

నా కుటుంబ వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు ఆ.. ||2||
నా వ్యాధి బలహీన సమయాలలోన ||2||
నాతో ఉండే దేవుడవు నీవు ||2||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2||

నన్ను పెంచావు నీవు
నన్ను పోషించావు నీవు ఆ.. ||2||
అన్నీ సహించి సీయోనులోనా ||2||
నాతో ఉండే దేవుడవు నీవు ||2||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2||

409. Mahima Gala Thandri Manchi Vyavasayakudu

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – మడికట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

నీతి పూత జాతి కథ – ఆత్మ సుధా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ నిధులు (2)
అమితమైన ఆత్మ బందు – అమర సుఖా శాంతులు (2)
అనుకూల సమయమిదే – పూయు పరమ పూతలు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

అపవాదికి అంటబడి – కుంటుబడి పోకుము
కాపుపట్టి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2)
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2)
అదిగో గొడ్డలి వేరున – పదును పెట్టియున్నది (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకుము (2)
ముండ్ల పొదలలో కృంగి – మూతబడి పోకుము (2)
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...