Friday, 9 March 2018

409. Mahima Gala Thandri Manchi Vyavasayakudu

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – మడికట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

నీతి పూత జాతి కథ – ఆత్మ సుధా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ నిధులు (2)
అమితమైన ఆత్మ బందు – అమర సుఖా శాంతులు (2)
అనుకూల సమయమిదే – పూయు పరమ పూతలు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

అపవాదికి అంటబడి – కుంటుబడి పోకుము
కాపుపట్టి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2)
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2)
అదిగో గొడ్డలి వేరున – పదును పెట్టియున్నది (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకుము (2)
ముండ్ల పొదలలో కృంగి – మూతబడి పోకుము (2)
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)

2 comments:

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...