Tuesday, 27 March 2018

412. Yerushalemulo Gorrela Dwaramu Daggara

యెరుషాలేములో గొర్రెల ద్వారము
దగ్గర బేతెస్థ కోనేరు కలదు
అందు మంటపము లయిదు చుట్టుగలవు
కుంటి వారు గ్రుడ్డివారు ఊచకాలు చేతులు గలవారు
గుంపులు గుంపులుగా అందు పడియుండిరి

దేవదూత దిగువేళ నీళ్ళు కదలును
ఆ నీళ్ళు కదులువేళ రోగి బాగుపడును
ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడును

ముప్పది ఎనిమిది ఏండ్లనుండి రోగి ఒక్కడు
స్వస్థత నొందలేక పడియుండెనక్కడ
యేసువచ్చి వానిని చూచి స్వస్థపరచెను

యేసులేక లోకమందు మేలువుండదు
ఏ మేలు ఉన్న యేసులేక శాంతియుండదు
యేసు వుంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...