Tuesday, 27 March 2018

414. Yesanna Swaramanna Nivepudaina Vinnava

యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా

జలముల శబ్ధము జనముల శబ్ధము
బలమైన ఉరుములతో 
కలిసిన స్వరము పిలిచిన యేసు
పిలిచిన పిలుపును నీ వింటివా

ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే
ఆదాము ఎదుటకు అరుగక దాగిన
అటులనే నీవును దాగెదవా

పనులన్ని వదలి జనులను విడచి నను కనుగొనుమనగా
కనిపెట్టినందున ఘనడబ్రహాముకు
కనిపించె మన కన్న తండ్రి యేసే

ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరమూ
ఈనాడు నీవు ఆ స్వరము వినగా
కానాను చేరగ కదలి రావా

ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాదమరసే
ధారాళముగను పరమ వరుని
దరిచేరికొని నీవు సేవించుమా

సౌలా సౌలా నన్నేల హింసింతువు
చాలించుమనే స్వరమూ
సౌలాధికునినంత సంధించగానే
సద్భక్తుడై పౌలుగా మారెను

స్వరమును వినగా పరమార్ధజ్ఞాని స్థిరుడైన యోహాను
పరమ మర్మములు భవిష్యద్విషయాలు
ప్రకించె ప్రతిరోజు స్మరియించుమా

8 comments:

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...