Friday 9 March 2018

411. Mithruda Rarammu

మిత్రుడా రారమ్ము - మైత్రితో పార -
మార్థికమైన - మాటల్ వచింతు -
మన్ననతో విను

పూర్వ జన్మము నందు - పూర్తిగా పాపిని
అందుకె ఈ బాధ - పొందుచునున్నాను
అని యిట్లు మనస్సులో - అనుకొననే వద్దు
అది నిజమే యైన - అది కూడ పోగొట్టు
రక్షకుడున్నాడు - తత్క్షణమె రమ్ము
ఆయన మానవుడై నట్టి దేవుండు
ఈ మాట నమ్మిన - ఎంత ధన్యుండవు
మనస్సులో ముద్రించు - కొని శాంతి పొందుము

ఈ జన్మమున గూడ - ఎన్నెన్నో పాపాలు
చేసియున్నందున - చివరకు నరకంబె
అని ఆత్మయందున - ఆలోచనెందుకు
అవి సిల్వపై యేసు - అంతరింప జేసె
ఆ వృత్తాంతంబును - ఆనందమున
నమ్మి సుఖముగ నుండుము
సూక్ష్మ మార్గంబిది ఎందరెన్నియన్న
ఏ మాటల్ వినవద్దు దేవ వాక్కె
నిజము - దిక్కులు చూడకు

తల్లిదండ్రుల్ చేసిన - తగని కార్యంబులు
నా మీదికె పొర్లి - నను జంపు చున్నవి
ఆ శాపమును నేను - అడ్డగింపలేను
అని పల్కుచును నీవు - అదరిపోకూడదు
పాపమని తెలియని - పాపాలు ఎన్నెన్నో
చేయ బట్టి యిన్ని - చిక్కులు నను జుట్టె
అని లేనిపోనట్టి - వనుకొనకుండుము
నీ పాపముల కంటె - నీ తండ్రి దయ గొప్ప

నీ పాప శాపాలు - నీ సర్వ వ్యాధులు
మోసికొన్నట్టి శ్రీ - యేసు దేవుడు ముందె
నీ కీడు పోగొట్టి - నీ కెన్నియో మేళ్ళు
సంపాదనము చేసె సర్వోపకారుండు
దేవుండు మానవుండు దివిలోన భువిలోన
నిను బట్టి పాపివి - నిను జూడనే వద్దు
ప్రభు యేసుని బట్టి - పరిశుద్ధుడవు నీవు
ఆయనను జూచిన అంతయు సరియౌను

ఇంటిలోని పోరు - ఇంకిపోవును గాక
వాదాలు బేదాలు వాడిపోవును గాక
కలహాలు నీటను కలిసిపోవును గాక
యుద్ధాలు క్రమముగ - ఉడిగి పోవును గాక
అన్ని పాపాలును అంతరించును గాక
సర్వ దేశములందు - శాంతి కలుగును గాక
నాగరికత ప్రతి - నరుని కబ్బును గాక
దేవుని మ్రొక్కుట తేజరిల్లును గాక
ఆయన బోధలే అలుము కొనును గాక
ప్రజలందరికి దైవ - భక్తి పెరుగును గాక
మంచి జీవిని - కనికరించు చుందురు గాక
పాడి పంటలు ప్రతి - వాని కుండును గాక
వెలుగు, నీరు, గాలి - కలుగ జేసిన తండ్రి
మన యందరి వలన ఘనత నొందును గాక

దివ్య దేవుడు నిన్ను - దీవించును గాక
భూమి చేసిన వాడు - పోషించును గాక
రక్షకుండౌ క్రీస్తు - రక్షించును గాక
పరమ వైద్యుడు స్వస్థ - పరచు చుండును గాక
పనులన్నిని సఫల - పరచు చుండును గాక
దైవాత్మ ధైర్యంబు - తెచ్చు చుండును గాక
అంతాన మోక్షంబు - అందజేయును గాక
విజయము ఈ పాట - విను వారి కామెన్

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...